Bakrid Holiday Change: తెలంగాణ రాష్ట్రంలో బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగ సెలవు దినం మారడంతో విద్యార్థుల పరీక్షల షెడ్యూల్‌లో కీలక మార్పులు జరిగాయి. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ (Director of Government Examinations) శనివారం విడుదల చేసిన ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ ప్రకారం.. గతంలో ప్రకటించిన సెలవు తేదీలో మార్పు రావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం, ఈ నెల మే 28న (28-05-2026) జరగాల్సిన మొదటి సంవత్సరం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed) పేపర్-3 (ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్) పరీక్షతో పాటు, డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ (D.P.S.E) మొదటి సంవత్సరం పేపర్-3 (హెల్త్, న్యూట్రిషన్ & కేర్ ఆఫ్ చిల్డ్రన్) పరీక్షలు వాయిదా పడ్డాయి. పోస్ట్‌పోన్ అయిన ఈ రెండు పరీక్షలను వచ్చే నెల జూన్ 1వ తేదీన (01-06-2026) రీషెడ్యూల్ చేస్తూ అధికారులు కొత్త డేట్స్ అనౌన్స్ చేశారు. ఈ మార్పులకు సంబంధించిన అప్‌డేటెడ్ రివైజ్డ్ హాల్ టికెట్లను (Revised Hall Tickets) విద్యార్థులు మే 25వ తేదీ నుంచి బోర్డ్ అఫీషియల్ వెబ్‌సైట్ www.bse.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
