NTV Telugu Site icon

Bairi Naresh: బైరి నరేష్ కోసం పోలీసులు వేట.. పీడీయాక్ట్ పెట్టాలంటున్న ఎమ్మెల్యే..

Naresh

Naresh

Bairi Naresh’s controversial comments on Ayyappa Swamy: హిందూదేవుళ్లు, అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ పరారీలో ఉన్నాడు. కోడంగల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయినప్పటి నుంచి పరారీలో ఉన్నారు. అతని కోసం నాలుగు బృందాల పోలీసులు వేట కొనసాగిస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి పరారీలో ఉన్నాడు బైరి నరేష్. హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్ లో నరేష్ కోసం వెతుకుతున్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు సాయంత్రం బైరి నరేష్ లొంగిపోతాడని తెలుస్తోంది. బైరి నరేష్ వ్యాఖ్యలపై అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్, రెంజర్ల రాజేష్ లపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయ్యప్ప భక్తులకు దొరికితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఉరికించి కొడుతాం అంటూ అయ్యప్పలు వార్నింగ్ ఇచ్చారు.

అయ్యప్ప స్వాములపై నరేష్ పై పీడీయాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై పలు జిల్లాల్లో కేసులు నమోదు అవుతున్నాయి. పలు జిల్లాల్లో అయ్యప్ప స్వాములు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే బైరి నరేష్ యూట్యూబ్ ఛానెల్ పై కూడా నిషేధించాలని హైదరాబాద్ లో కేసు నమోదు అయింది.

పీడీ యాక్ట్ పెట్టాలి: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.

అయ్యప్ప స్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ పై పిడియాక్ట్ పెట్టాలని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. హిందూ సమాజాన్ని కించపరించెలా వాక్యాలు చేసిన బైరి నరేష్ ను కఠినంగా శిక్షించాలన్నారు. అత్యంత పవిత్రమైనది అయ్యప్ప మాలధారణ అని.. గత 25 ఏళ్లుగా అయ్యప్ప మాల వేసుకుంటున్నానని అన్నారు. అయ్యప్ప స్వామి మాలను వేసుకున్నవారిని కించపరచడం దారుణమన్నారు. ఎవరూ కూడా ఏ మతాన్ని , కులాన్ని ఉద్దేశించి ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు. బైరి నరేష్ పై త్వరలోనే డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు.