Baby Snake Found In Dal In ECIL Canteen: కుషాయిగూడలోని ఈసీఐఎల్ కంపెనీ క్యాంటీన్‌లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం భోజనం సమయంలో.. ఒక ప్లేటులో అన్నం వడ్డిస్తున్నప్పుడు, పప్పులో పాము వచ్చింది. అది చూసిన ఉద్యోగులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. అన్నం వేసుకున్న ప్రతి ఒక్కరూ తమ ప్లేట్లను పక్కన పెట్టేశారు. దీనిపై ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
Realationship : భార్యాభర్తలు విడిపోవడానికి అసలు కారణాలు ఇవే?
ఈసీఐఎల్ సెంట్రల్ క్యాంటీన్‌లో వండిన ఆహార పదార్థాలను చర్లపల్లిలోని ఈవీఎం సంస్థకి మధ్యాహ్న భోజనానికి తరలిస్తారు. ఎప్పట్లాగే శుక్రవారం మధ్యాహ్నం కూడా ఉద్యోగులకు ఆహారం అందించే సమయంలో.. పప్పులో నుండి పాము పిల్ల ఒక్కసారిగా బయటపడింది. అది చూసిన ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. సిబ్బంది మరీ ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారా? అంటూ మండిపడ్డారు. అయితే.. ఈ విషయం బయటకు రాకుండా యజమాన్యంతో పాటు సిబ్బంది సైతం జాగ్రత్తపడింది. కానీ.. అప్పటికే కొందరు ఉద్యోగులు భోజనం చేశారు. పప్పులో పాము పిల్ల వచ్చిన విషయం తెలిసి.. వాళ్లందరూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల్లో ఒకరు తన ఫోన్‌లో పాము పిల్ల ఫోటోని క్లిక్‌మనిపించి, బయటకు వదిలాడు.
Rajasthan Minister: సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు మంత్రి తొలగింపు
ఈ క్యాంటీన్‌లో ఇలాంటి వ్యవహారం వెలుగుచూడటం.. ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆహార పదార్థాల్లో ఎలుకలు, బీడీలు, సిగరెట్టు, జిల్ల పురుగులు వచ్చినట్టు ఉద్యోగులు తెలిపారు. ఏమాత్రం నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నారని వాళ్లు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు పాము పిల్ల రావడంతో.. ఆహార పదార్థాల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిని వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా ఈసీఐఎల్ క్యాంటీన్ అధికారుల్ని ఉద్యోగులు డిమాండ్ చేశారు. కంపెనీ యాజమాన్యంపై కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్లు కేసు నమోదు చేయాలని, పూర్తిస్థాయి విచారణ చేయించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
