NTV Telugu Site icon

Sandeep Shandilya: 21 ఏళ్లలోపు వాళ్లకు మద్యం అమ్మకూడదు.. కానీ..!

Sandeep Shandilya

Sandeep Shandilya

Sandeep Shandilya: 21 ఏళ్ళలోపు వాళ్ళకు మద్యం అమ్మకూడదు కాని ఎవరు పట్టించుకుంటున్నారని యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య మండిపడ్డారు. హైదరాబాద్ సిటీ కమిషనరేట్ లో నేడు డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. వరుసగా నమోదవుతున్న డ్రగ్స్ కేసుల నేపథ్యంలో పోలీసుల అలెర్ట్ అయ్యారు. విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు డ్రగ్స్ భూతం పై అవగాహన కల్పించారు పోలీసులు. నార్కో టెర్రరిజం పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ లో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సెమినార్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో.. ముఖ్య అతిథిగా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి బుర్ర వెంకటేశం, యాం టీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్న విద్యాశాఖ అధికారులు, పోలీసు సిబ్బంది‌, పలు స్కూల్, కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ.. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడుతున్న వారి సినిమాలు చూడకూడదని సూచించారు. అలాంటి సినిమాలాను ఎంకరేజ్ చేయొద్దని అన్నారు.

Read also: Family Star : విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్ ” టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

పిల్లలకు డబ్బులు ఇచ్చి పేరెంట్స్ చెడగొడుతున్నారని తెలిపారు. చదువుల్లోనే పిల్లలను మానసికంగా ఒత్తిళ్ళకు గురి చేస్తున్నారని, గ్రేడ్ ల పరంగానే ప్రపంచం లేదు, ఈ విషయం గుర్తించుకోవాలన్నారు. పిల్లలు చెడిపోతున్నారంటే ఎవరిది బాధ్యత పేరెంట్స్‌దా? టీచర్స్ దా? పిల్లలదా? పోలీసులదా? అని ప్రశ్నించారు. 21 ఏళ్ళలోపు వాళ్ళకు మద్యం అమ్మకూడదు కాని ఎవరు పట్టించుకుంటున్నారని మండపడ్డారు. పిల్లల మానసిక స్తితిని పేరెంట్స్, టీచర్స్ గుర్తించకపోతే ఎవరు గుర్తిస్తారని తెలిపారు. పిలల్లను ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దాలని సూచించారు. పిల్లలను నిరుత్సాహ పరచకండి, ఉత్సాహ పరచాలని తెలిపారు. ఇంట్లో పరిస్తితుల కారణంగా టీనేజ్ వయస్సులోనే డ్రగ్స్ వైపు ఎందుకు బానిసలుగా మారుతున్నారని, ఇటీవల కాలంలో పిల్లలు తమ బాల్యాన్ని కోల్పోతున్నారని అన్నారు. ఈ విషయాన్ని ఎవరు గుర్తించడం లేదని, జీవితంలో అత్యున్నత స్థానంలో ఉన్న వారు సైతం డ్రగ్స్ బారిన పడుతున్నారని తెలిపారు.
Vishaka MP Seat: ఏపీ బీజేపీలో పెరుగుతోన్న పోటీ.. విశాఖపై కీలక నేతల కన్ను!