Family Star : విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్ ” టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నాడు.వీటిలో విజయ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఫ్యామిలీ స్టార్..గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.. VD13 ప్రాజెక్టుగా వస్తోన్న ఈ చిత్రంలో సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు,తమిళ మరియు హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతుండగా.. టైటిల్ లుక్ మరియు గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యామిలీ స్టార్ టీజర్ అప్‌డేట్ రానే వచ్చింది. ఈ మూవీ టీజర్‌ను మార్చి 4 సాయంత్రం 6:30 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రకటిస్తూ కొత్త లుక్ లాంఛ్ చేశారు. టీషర్ట్‌లో లుంగీని పట్టుకుని ఉన్న బ్యాక్ లుక్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
లైన్‌లో నిలబడి ఉల్లిపాయలు తేవడం..టైంకు లేచి పిల్లలను రెడీ చేసి స్కూల్ పంపించడమనుకున్నావా సెటిల్‌మెంట్ అంటే..? అని అజయ్ ఘోష్ అంటుంటే.. భలే మాట్లాడతారన్నా మీరంతా.. ఏ ఉల్లిపాయలు లైన్‌లో నిలబడి కొంటే వాడు మనిషి కాదా..పిల్లలను రెడీ చేస్తే వాడు మగాడు కాదా.. ఐరనే వంచాలా ఏంటీ.. కొబ్బరికాయ తేవడం మర్చిపోయా.. తలకాయ కొట్టేశా అని విజయ్ దేవరకొండ గ్లింప్స్ వీడియోలో క్లాస్ లుక్‌లో చెబుతున్న మాస్ డైలాగ్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి.కాగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే విధంగా సినిమాలు చేసే పరశురామ్ ఈ సారి ఎలాంటి టీజర్‌ను కట్ చేశాడని మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయ్ దేవరకొండ మరోవైపు జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో VD12లో కూడా నటిస్తున్నాడు. పోలీస్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్-శ్రీకర స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోండగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
The announcement we've all been waiting for is finally here!#FamilyStar teaser out on 4th March at 6:30 PM!#FamilyStarOnApril5th @TheDeverakonda @Mrunal0801 @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official @TSeries @tseriessouth pic.twitter.com/6sfMnvQ6XI
— Sri Venkateswara Creations (@SVC_official) March 3, 2024
తాజావార్తలు
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!