NTV Telugu Site icon

Insecticide in Cool Drink: కోడలిపై అత్త మామల దాష్టీకం.. కూల్‌ డ్రింక్‌ లో పురుగుల మందు కలిపి..

Insecticide In Cool Drink

Insecticide In Cool Drink

Insecticide in Cool Drink: కొమురం భీం జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ పెళ్లి ఇష్టం లేక కోడలి పై హత్యాయత్నం చేశారు అత్త, మామల, భర్త. కోడలు గర్భిణీ అని తెలిసి కూడా తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. అన్యోన్యంగా ఉంటూనే వారిపై అనుమానం రాకుండా కోడలు తాగే కూల్‌ డ్రింక్‌ లో పురుగుల మందు కలిపి ఆమెతో తాగించారు. దీంతో పురిటి నొప్పులు రావడంతో హుటా హుటిన ఆసుపత్రికి తరలించగా.. అక్కడ అసలు భాగోతం బట్టబయలు అయ్యింది. పుట్టిన బిడ్డ మరుసటి రోజే మృతి చెందాడు దీనికి గల కారణం పురుగుల మందు తాగడం వలనే బిడ్డ చనిపోయాడని వైద్యులు వెల్లడించారు. కోడలి పరిస్థితి కూడా కాస్త విషమంగా వుందని వైద్యులు తెలిపారు. అయితే అమ్మాయి తరుపు బంధువులు తల్లిదండ్రులు అత్త, మామ, భర్తపై పోలీస్టేషన్‌ లో ఫిర్యాదు చేయండంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని భర్త మహేందర్, అత్త విమల, మామ లహాన్ ల అరెస్ట్ చేశారు పోలీసులు.

Read also: Global Investors Summit: ఏపీలో పెట్టుబడిదారుల సమ్మిట్‌.. మస్క్, కుక్‌లకు ఆహ్వానం..

కొమురం భీం జిల్లా సిర్పూర్ టీ మండలం కేశవ పట్నం కు చెందిన కవిత మహేందర్ ల మధ్య ప్రేమ వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో కవిత గర్భవతి అయ్యింది. తనను పెళ్లి చేసుకోవాలని మహేందర్‌ ను కవిత కోరగా ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదని పెళ్లి వద్దంటూ చెప్పుకుంటూ వచ్చారు. అయితే.. కవిత , తల్లిదండ్రులు పెద్దల పంచాయితీ పెట్టడంతో గత్యంతరం లేక మహేందర్‌ కవితను వివాహం చేసుకున్నాడు. అత్త మామ ఇంటికి వచ్చిన కవితపై కర్కసత్వానికి పూనుకున్నారు అత్త,మామ, భర్త ఆమను హతమార్చేందుకు ప్లాన్‌ వేశారు. వారిచేతికి అంటకుండా ఆమె తాగే కూల్‌ డ్రింక్‌ లో పురుగుల మందు కలిపి ఆమెతో తాగించారు. ఏమీ తెలియనట్లు చేతులు దులుపుకునేందుకు పన్నాగం పన్నారు. అయితే.. పురిటి నొప్పులు రావడంతో కవిత తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా పండెంటి బిడ్డను జన్మనిచ్చింది. అయితే పుట్టిన బిడ్డ మరుసటి రోజే మృతి చెందింది. శిశువు మృతి, కవిత పై హత్యాయత్నం జరిగిందని వైద్యులు నిర్ధారించడంతో.. కవిత తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. భర్త మహేందర్, అత్త విమల,మామ లహాన్ ల అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పుట్టిన రెండో రోజే శిశువు మృతి చెందడంతో కవిత ఆబిడ్డను చూసి కన్నీరు పెట్టుకుంది. గుండెకు హత్తుకుని బోరు ఏడ్చింది. ప్రతి ఒక్కరిని ఆసంఘటన కంటతడిపెట్టించింది.
MLA’s Purchase Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. నేడు విచార‌ణ