Site icon NTV Telugu

Husband is cruel to his wife: తాగి చస్తావా.. అన్నందుకు భార్యనే హతమార్చిన భర్త! ఆపై అలా చేసేందుకు..

Husband Is Cruel To His Wife

Husband Is Cruel To His Wife

Husband is cruel to his wife: ఇంట్లో దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అనడం అది పాత సామెతగా మరింది. ఇప్పుడు ఉల్లి గడ్డా నీ వెంత వుడికినా నీ కంపుపోదు అన్నట్లు పోలీసులు ఇలాంటి ఘటనల్లో ఆరితేరిపోయారు. వాసలను పసిగట్టి నేరస్తులు ఎవరో క్షణాల్లో పట్టుకుంటున్నారు. జీవితంలో తోడూ నీడై తనకు అండగా వుండాల్సిన భర్తే తనకు ఆమె పాలిట యముడయ్యాడు. తొగొద్దు అన్నందుకు కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఆపై ఆమె ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించేందుకు.. తన తెలివి ఉపయోగింది ఓ ఐడియాను కూడా అల్లాడు. కానీ, అదికాస్తా తనకే బిడిసి కొట్టడంతో.. చివరకు ఆఘోరం చేసింది తనేనని ఒప్పుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం చిట్కుల్ గ్రామంలో చోటుచేసుకుంది.

Read also: AP Assembly: మంత్రి నాగార్జున కామెంట్లపై సభలో దుమారం

ప్రకాశం జిల్లా వాలేటివారిపాలెం మండలం పోకురు గ్రామానికి చెందిన ప్రవీణ్, భార్య ప్రియాంకతో కలిసి బతుకుతెరువుకోసం సంగారెడ్డి జిల్లా పటాన్​ చెరు మండలం చిట్కుల్ గ్రామానికి వచ్చి మేస్త్రిగా పని చేసుకుంటూ బతుకు జీవనం కొనసాగిస్తున్నారు. భర్త ప్రవీణ్ విపరీతంగా మద్యం తాగడంతో, భార్య ప్రియాంక గొడవపడేది. ఇలా గతంలోనూ వీరిద్దరికి గొడవలు జరగడంతో స్వగ్రామంలో పెద్దలు పంచాయితీ పెట్టి సర్దిచెప్పారు. ఇప్పుడుకూడా.. వలస వచ్చిన చిట్కుల్ గ్రామంలో సైతం ఇదే మాదిరిగా గొడవలు జరిగేవి, అయితే.. తాను మద్యం తాగేందుకు అడ్డువస్తుందని భావించిన భర్త, భార్యను హతమార్చేందుకు ప్లాన్‌ వేశాడు. భార్యను ఈనెల 12వ తేదీన ఉదయం గొంతు నులిమి హత్యచేశాడు. అయితే అది ఆత్మహత్యగా చిత్రీకరించాడు. అయితే.. మృతురాలి సోదరుడు హరికృష్ణ ఫిర్యాదుతో పోలీసులకు అనుమానం వచ్చి పోస్టుమార్టం చేయించగా గొంతు నులిమి హత్యచేసినట్లు నివేదికలో తేలింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు ప్రవీణ్​ ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా భార్యను గొంతునులిమి హత్యచేసినట్లు అంగీకరించాడు. అంతేకాకుండా.. ఆమె మెడకు చీరచుట్టి ఉరివేసుకుందని నమ్మించే ప్రయత్నం చేసినట్లు విచారణలో తేలిపాడు. నిందితుడు ప్రవీణ్‌ ను అదుపులో తీసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు.
TCS Number One: దటీజ్‌.. టీసీఎస్‌. దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌. నంబర్ వన్‌ పొజిషన్‌

Exit mobile version