Beer bottle: మీర్ పేట్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి బీర్ బాటిళ్లు ఇవ్వనందుకు కొందరు యువకులు కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. నిన్న అర్ధరాత్రి జిల్లెల్ల గూడలో సాయి వర ప్రసాద్ అనే వ్యక్తి బీర్ బాటిల్ తీసుకుని రోడ్డు మార్గంలో వెళుతుండగా కొందరు యువకులు అడ్డుకున్నారు. బీఆర్ బాటిల్లు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీకు ఎందుకు ఇవ్వాలని యువకులను సాయి ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన నితీష్ గౌడ్, కిరణ్ గౌడ్,సంతోష్ యాదవ్,పవన్ అనే నలుగురు యువకులు సాయిపై దాడి చేశారు. అయినా సాయి బీర్ బాటిళ్లు ఇవ్వలేదు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సాయిపై ఆ నలుగురు దాడి చేస్తుండటంతో సాయి గట్టిగా అరచాడు. దీంతో ఎక్కడ స్థానికులు వస్తారని కత్తితో సాయిని పొడిచారు.
Read also: Pawan Kalyan: గెట్ రెడీ ‘బ్రో’… ట్రైలర్ వచ్చేస్తోంది!
కత్తితో సాయి వర ప్రసాద్ పై విచక్షణా రహితంగా దాడి చేయడంతో కుప్పకూలిపోయాడు. దీంతో ఆ నలుగురు సాయి వద్ద ఉన్న బీర్ పాటిళ్లను తీసుకుని పరారయ్యారు. స్థానిక సమచారంతో ఘటనా స్థలికి మీర్ పేట్ పోలీసులు చేరుకున్నారు. సాయిని పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పల్లె నితీష్ గౌడ్, కిరణ్ గౌడ్,సంతోష్ యాదవ్, పవన్ పై కేస్ నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. వీరందరూ గంజాయి సేవించి సాయిపై దాడి చేశారా? లేక సాయి తీసుకున్న బీర్ బాటిళ్ల కోసమే కత్తితో పొడిచి చంపారా? అనే కోణంలో విచారణ చేపట్టారు. సాయి మృతిని కుటుంబ సభ్యులను తెలియజేశారు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Steel Man: ఉక్కు మనిషి.. సెంచరీ దాటేశాడు