NTV Telugu Site icon

Atrocity in Medchal: మేడ్చల్‌ లో దారుణం.. మంత్రాల పేరుతో వివాహితపై అత్యాచారం

Meadchel

Meadchel

Atrocity in Medchal: తరాలు మారినా మారని మూఢనమ్మకాలు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అనే ప్రశ్న మనిషి ఎందుకు ఆలోచించలేక పోతున్నాడనేదానిపై రీసెర్చ్‌ చేసిన సమాధానం దొరకదనే చెప్పాలి. ఎందుకంటే మనిషి ఆశాజీవిగా మారుతున్నాడు. నేనేంటి నాకేంటా అనే రీతిలో బతికేస్తున్నాడు. కంటి ఎదుట ఎవరికైనా ప్రమాదం జరిగినా చూసి చూడనట్లు వెళుతున్న కాలాన్ని మనం చూస్తున్నాం. దానికితోడు మనజీవనంలో మంత్రాలు ఒక భాగమై పోతున్నాయి. ఒకరు వచ్చి మీకు కొన్ని సమస్యల్లో ఉన్నారు దాన్ని మంత్రాల సహాయంతో దూరం చేయొచ్చు అనే మాటలకు.. వెనక ముందు ఆలోచించకుండా తల ఆడిస్తున్నాడు. ఆలోచన లేకుండా సరే అనడంతో మనం ఏం పోగొట్టుకుంటున్నామనేది కూడా మరిచిపోతున్నాడు. ఈ కాలంలో కూడా మనిషి మూఢనమ్మకాలను నమ్ముతున్నాడంటే మనం ఎలాంటి దుర్భరజీవితాన్ని అనుభవిస్తున్నామనేది అర్థమవుతుంది. మంత్రాల నెపంతో స్నేహితుడు భార్యనే అత్యాచారం చేసిన ఘటన మేడ్చల్‌ లో సంచలనంగా మారింది.

Read also: Group-1 Prelims: నేడే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష.. కేంద్రాల వద్ద 144 సెక్షన్..

ఓడిశాకు చెందిన షేక్ మోసిన్ అనే వ్యక్తి బతుకుదెరువు కోసం మేడ్చల్‌ కు భార్యతో కలిసి వలస వచ్చాడు. మేడ్చల్ మండల పరిధిలోని రావల్ కోల్లో ఉన్న సింగానియా చాక్లెట్ కంపెనీలో పనిచేస్తూ మేడ్చల్ పట్టణ పరిధిలోని కిష్టాపూర్లో నివాసం ఉంటున్నారు. కంపెనీలోని షేక్ మోసిన్ కు మరోవ్యక్తి పరిచమయ్యాడు. వీరిద్దరు స్నేహంతో బాగా ఉండేవారు. షేక్ మోసిన్ కు మరో వ్యక్తి తన భార్య పాలైందని చెప్పాడు. దీంతో ఇదే అలుసుగా తీసుకున్న షేక్ మోసిన్ తనకు మంత్రాలు వస్తాయని దాని వల్ల నీ భార్య ఏదైన సమస్యవుంటే నయం చేస్తానని నమ్మబలికాడు. షేక్ మోసిన్ మాటలకు సదరు వ్యక్తం స్నేహితుడే కదా అని నమ్మాడు. దీంతో ఈ విషయాన్ని భార్యకు చెప్పి నీకు ఏదైనా సమస్య వుంటే నా స్నేహితుడు షేక్ మోసిన్ కు చెప్పమని అనడంతో భర్తకు స్నేహితుడే కదా అని భార్య సరే అంది. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో షేక్ మోసిన్ కిష్టాపూర్ లోని స్నేహితుడి ఇంటికి వచ్చాడు.

Read also: Astrology: జూన్ 09, ఆదివారం దినఫలాలు

అయితే స్నేహితుడు తనకు రాత్రి షిప్టు ఉందని నా తమ్ముడు ఇక్కడే ఉంటాడని చెప్పి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. షేక్ మోసిన్ తన స్నేహితుడు భార్యను చూసి నువ్వేమి భయపడాల్సిన అవసరం లేదని నీ సమస్యను పరిష్కారం చూపిస్తా అంటూ గదిలోకి వెళ్లమన్నాడు. అయితే అక్కడే వున్న స్నేహితుడు తమ్మడిని ఇంటి బయట ఉండాలని మంత్రం వేసేటప్పుడు అరుపులు విన్పిస్తాయని పట్టించుకోవద్దని మాయ మాటలతో నమ్మబలికాడు. మోసిన్ గది లోపలికి వెళ్లి, తన సహ ఉద్యోగి స్నేహితుడి భార్యపై అత్యాచారానికి పాల్పడి, పారిపోయాడు. ఈ అవమానం భరించలేక బాధితురాలు సింధూరం తిలకాన్ని నీళ్లలో కలుపుకొని తాగింది. దీంతో అస్వస్థతకు గురై కింద పడిపోయింది. ఆమెను ఆస్పత్రిలో చేర్చి, చికిత్స అందించడంతో కోలుకుంది. శనివారం ఉదయం 7 గంటలకు జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎస్సైలు, సిబ్బంది తగిన ఆధారాలు సేకరించి, నిందితుడిని పట్టుకుని, రిమాండ్ కు తరలించారు.
Kalki 2898 AD : ఎక్కడ చూసిన ‘కల్కి’ మయమే..ఈ సారి మరింత భారీగా..?

Show comments