NTV Telugu Site icon

Love Harassment: పెళ్లికి నిరాకరించిన మరదలు.. కత్తితో దాడిచేసిన అక్కమొగుడు

Rangareddy

Rangareddy

Love Harassment: రంగారెడ్డి జిల్లా కేశంపేటలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ, పెళ్లి పేరుతో మరదలిపై అక్కమొగుడు కత్తితో దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కేశంపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన అనిత రోజూలాగే తన విధులు నిర్వహించేందుకు ఆఫీసుకు వెళ్లింది. అయితే స్టాఫ్ నర్స్ కావడంతో అక్కడే నిద్రించింది. ఇదే అలుసుగా భావించిన అక్క మొగుడు అనిల్ (వరుసకు బావ) కేశంపేటకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. ఆమె నిద్రిస్తుండటంతో ఆమెపై దాడి చేశాడు. తనతో తెచ్చుకున్న కత్తితో మెడ, చేతి మణికట్టు కోసి తీవ్రంగా గాయపరిచాడు. అయితే అనిత గట్టిగా అరవడంతో తోటి సిబ్బంది గమనించి అతనిని తోసేయ్యడంతో అనిల్ దుండగుడు పారిపోయాడు. తీవ్ర రక్తం మడుగులో ఉన్న అనితను షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read also: SI And Constable Events: ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్‌.. నేటి నుంచి ఈవెంట్స్‌.. ఇవి తప్పనిసరి..

అయితే స్థానిక సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. అక్క భర్త వేధిస్తూ తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే మిమ్మల్ని రోడ్డుపైకి తెస్తానని బెదిరిస్తున్నాడని పేర్కొంది అనిత. ఎవరిని పెళ్లి చేసుకొనివ్వనని, కొన్నాళ్లుగా వత్తిడి చేస్తున్నాడని తెలిపింది. పెళ్లికి తిరస్కరించడంతో ఈ రోజు ఆసుపత్రిలో డ్యూటీ లో ఉన్న అనిత పై కత్తి తో దాడి చేసి హత్యా యత్నం చేసాడని బాధితురాలు వివరించింది. అనితపై దాడి చేసింది అనిత అక్క భర్త కిషన్ అని ,నితకు వరుసకు బావ అవుతాడని తెలిపింది. తనను పెళ్లి చేసుకోవాలని వేధించాడని అయితే పెళ్లికి నిరాకరించడంతో తనపై బావ కిషన్‌ దాడి చేశాడని వాపోయింది. కొద్దిరోజులుగా ప్రేమించమని వేధించాడని తను ఒప్పుకోలేదని, ఆతరువాత పెళ్లి చేసుకోమని వేధించాడని పోలీసులకు తెలిపింది. అయితే తన బావ వల్ల తనకు ప్రాణమాని ఉందని తనను కాపాడాలని కోరింది. తను ఉద్యోగం చేస్తున్నదగ్గరే వచ్చే ఇలాంటి ఘాతుకానికి పాల్పడతాడని ఊహించలేదని భయంగా ఉందని అనిత చెప్పుకొచ్చింది.
Pakistan: ఇస్లామాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. 300 దుకాణాలు దగ్ధం..

Show comments