NTV Telugu Site icon

Uppal Crime: ప్రాణం మీదికి తెచ్చిన రీల్స్ పిచ్చి.. సినిమా అవకాశం రావడంతో గొంతుకోసిన బావ..

Uppal Crime

Uppal Crime

Uppal Crime: ఉప్పల్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది యువతి గొంతు కోసిన కలకలంగా మారింది. తనతో పెళ్లికి నిరాకరించడంతో కత్తితో గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడని పేర్కొన్నాడు. వెంటనే అప్రమత్తమైన యువతి తప్పించుకుని పారిపోయి కుటుంబ సభ్యుల సాయంతో ఆస్పత్రిలో చేరింది. ఈ ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఖమ్మం జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ హబ్సిగూడలో నివాసం ఉంటున్నాడు. అతని పెళ్లై ఇదరు పిల్లలు కూడా ఉన్నారు. లక్ష్మీనారాయణ షార్ట్ ఫిల్మ్‌లతో పాటు వీడియో ఎడిటింగ్ కూడా చేస్తున్నాడు. రామంతాపూర్‌లో నివసించే బాధిత యువతికి లక్ష్మీనారాయణ బావ. లక్ష్మీనారాయణతో ఆ యువతి సోషల్ మీడియాలో రీల్స్ కూడా చేసుకున్నట్లు సమాచారం. దీంతో లక్ష్మీనారాయణ కన్ను ఆ యువతిపై పడింది. రీల్స్ తీస్తూనే ఆ యువతితో చనువు పెంచుకున్నాడు. ఆ యువతితో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడేవాడు. లక్ష్మీనారాయణ బావకావడంతో బంధువులే కదా అన్నట్లు ఆ యువతికూడా చనువుగా ఉండేది. అదే చనువుతో లక్ష్మీనారాయణ పెళ్లి ప్రతిపాదనలు తీసుకొచ్చాడు. అతనికి పెళ్లైందన్న కారణంతో యువతి నిరాకరించింది.

Read also: Anasuya Bharadwaj Hot Pics: అందాల అనసూయ.. అక్కడ టాటూ అదుర్స్!

తాజాగా ఆ యువతికి సినిమా రంగంలో అవకాశం వచ్చింది. అప్పటి నుంచి లక్ష్మీనారాయణను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న లక్ష్మీనారాయణ ఆమెను చంపేందుకు ప్లాన్ వేశాడు. ఎలాగైనా తనతో బయటకు తీసుకువచ్చి చంపేందుకు కుట్ర పన్నాడు. తన వద్దకు వెళ్లి నీతో మాట్లాడాలని చెప్పి తన కారులో ఎక్కించుకుని ఈనెల 22న ఉప్పల్ భగాయత్ కు తీసుకొచ్చాడు. మాట మాట కలిపాడు.. మళ్లీ పెళ్లి అంశాన్ని తెరపైకి తెచ్చాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తన ప్రేమను ఒప్పుకోవాలని అమ్మాయిని బలవంతపెట్టే ప్రయత్నం చేశాడు ఆమె నిరాకరించడంతో ముందుగా ప్లాన్ చేసుకున్న లక్ష్మీనారాయణ తన వెంట తెచ్చుకున్న కత్తితో కారులో ఉన్న బాలిక గొంతుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన యువతి తప్పించుకుని బయటకు వచ్చి మెడకు చున్నీ చుట్టి కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. గాయపడిన యువతి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని లక్ష్మీనారాయణ రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం యువతీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఉప్పల్ పోలీసులు తెలిపారు.
Anasuya Bharadwaj Hot Pics: అందాల అనసూయ.. అక్కడ టాటూ అదుర్స్!