Assam CM to Basara: తెలంగాణ రాష్ట్రంలో పార్ల మెంటు ఎన్నిక లు దగ్గరపడుతున్న నేపథ్యంలో బీజేపీలో సమర శంఖారావం పూరించనుంది. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎంపీ ఎన్నికల బస్సు యాత్ర ప్రారంభం కానుంది. భారతీయ జనతా పార్టీ విధివిధానాలు, వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో పార్లమెంట్ ఎన్నికల రంగంలో శ్రేణులను ఏకం చేసేందుకు ఇవాళ బాసర పుణ్యక్షేత్రం నుంచి విజయ సంకల్ప యాత్ర పేరిట బస్సు యాత్రను ప్రారంభిస్తోంది. ఆదిలాబాద్ పెద్దపెల్లి నిజామాబాద్ పార్లమెంట్ స్థానాలను కలుపుతూ 21 శాసనసభ స్థానాల్లో దాదాపు 310 కిలోమీటర్ల మేర బస్సుయాత్ర కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి అశోక్ ముఖ్యకార్యదర్శి హిమంత విశ్వ శర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
Read also: Kalki: ఈ ఇద్దరు కలిస్తే పాన్ ఇండియాకి పూనకాలే…
బాసర సరస్వతీ ఆలయంలో ఉదయం 9 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా భైంసా చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు జిన్నింగ్ ఫ్యాక్టరీ ఆవరణలో ఎస్‌ఎస్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. భోజనం తర్వాత యాత్ర ప్రారంభమవుతుంది. కల్లూరు, నర్సాపూర్ (జి), దిలావర్‌పూర్‌లో రోడోషో ముగించుకుని నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు అక్కడ బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు.
Read also: IIM-Visakhapatnam: నేడు IIM- విశాఖ శాశ్వత క్యాంపస్ ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ, సీఎం జగన్..
నారాయణ పేటలో కిషన్ రెడ్డి..
నారాయణపేట జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్రలో పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు నారాయణ పేట జిల్లా కృష్ణా నదిలో పూజలు నిర్వహించారు. అనంతరం కృష్ణా గ్రామంలో విజయసంకల్ప యాత్రను ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటలకు మాగునూరు మండలం మీదుగా మక్తల్ పట్టణంలో రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి ఊట్కూరు మండలంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సింగారం గేటు మీదుగా రోడ్ షో నిర్వహించి బహిరంగ సభలో పాల్గొంటారు. చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం ఇవాళ రాత్రికి అక్కడే బస చేయనున్నారు.
Amrit Bharat Express: త్వరలో పట్టాలెక్కనున్న 50అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు