NTV Telugu Site icon

American Consulate: ఆసియాలోనే అతిపెద్ద అమెరికన్ కాన్సెలేట్.. ఇక వీసా మరింత ఈజీ

American Conculate

American Conculate

Asia Biggest American Consulate Starts Its Operations In Hyderabad: హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో సరికొత్త అమెరికన్ కాన్సులేట్ భవనం ప్రారంభమైంది. గత 14 సంవత్సరాల నుంచి బేగంపేటలోని ‘పైగా ప్యాలెస్’లో సేవలు అందించిన అమెరికన్ కాన్సులేట్.. ఈ సోమవారం నుంచే ఈ కొత్త కార్యాలయంలో తన కార్యకలాపాలను మొదలుపెట్టింది. ఇది ఆసియాలోనే అదిపెత్త అమెరికన్ కాన్సులేట్. 12.2 ఎకరాల విస్తీర్ణంలో.. రూ.2800 కోట్ల భారీ పెట్టుబడితో అధునాతన సౌకర్యాలతో ఈ భవనాన్ని నిర్మించారు. స్టూడెంట్ వీసా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. అందుకు అనుకూలంగా ఓ పెద్ద కార్యాలయం స్థాపించాలని నిర్ణయించుకొని, 2017లోనే ఈ విశాలమైన బిల్డింగ్ నిర్మాణాన్ని చేపట్టింది. దీనికి కావాల్సిన సదుపాయాలు, డబ్బులను అమెరికా ప్రభుత్వం కేటాయించింది.

British Envoy: దెబ్బకు దెబ్బ కొట్టిన భారత్‌.. బ్రిటన్ హైకమిషన్‌ బయట బారికేడ్లు తొలగింపు

రెండు తెలుగు రాష్ట్రాల నుండి స్టూడెంట్ వీసాలతో పాటు లక్షలాది తెలుగు ప్రజలు వాణిజ్య, పర్యాటక, డిపెండెంట్ వీసాల అవసరాల కోసం హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్‌కి వెళ్తుంటారు. ఒడిశాకు చెందిన వారు కూడా ఇక్కడికే ఎక్కువగా వస్తుంటారు. ఎందరో ప్రవాస భారతీయులు, అమెరికన్ పౌరసత్వం పొందినవారు.. అమెరికన్ పాస్‌పోర్ట్, ఇతర అవసరాల కోసం అమెరికన్ దౌత్య కార్యాలయానికి వెళ్తుంటారు. దేశ రాజధాని ఢిల్లీలోని అమెరికన్ ఎంబస్సితో పాటు వీసా కార్యకలాపాలు, దౌత్య కార్యకకలాపాల కోసం నాలుగు కాన్సులేట్స్ ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు హైదరాబాద్‌లో అతిపెద్ద కాన్సులేట్‌ని నిర్మించారు. ఇక్కడి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ తెలిపారు. ఈ కొత్త కార్యాలయాన్ని పూర్తి పర్యావరణహితంగా నిర్మించామని.. వాన నీటిని ఒడిసిపట్టి, శుద్ధి చేసి, దాన్ని తిరిగి వినియోగించుకునేలా చర్యలు చేపట్టామని తెలిపారు. హైదరాబాద్‌లో స్థాపించబడ్డ అమెరికన్ కంపెనీలు, ఇండియాలోని అమెరికా పెట్టుబడులే కాకుండా.. ఇండియా నుండి అమెరికాలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఈ కొత్త కాన్సులేట్ బిల్డింగ్ ఎంతో దోహదపడుతుందని.. వాషింగ్టన్‌లో అమెరికన్ డిపార్ట్మెంట్ అఫ్ స్టేట్ వేదాంత్ పటేల్ కూడా వివరించారు.

Revanth Reddy: గవర్నర్‌కి రేవంత్ లేఖ.. సీబీఐ, ఈడీలను రంగంలోకి దింపాలని డిమాండ్

భారత్‌-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని.. గత 14 ఏళ్లుగా 16 లక్షల వీసాలు జారీ చేశామని.. కొత్త కాన్సులేట్‌ కార్యాలయం నుంచి మరింత మెరుగైన సేవలు అందిస్తామని జెన్నిపర్ లార్సన్ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య, వీసాల కోసం వెయిటింగ్‌ లిస్ట్‌ భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. కొత్త కార్యాలయానికి శ్రీకారం చుట్టినట్టుగా పేర్కొన్నారు. పాత కార్యాలయంలో వీసా ఇంటర్వ్యూ విండోలు 20 మాత్రమే ఉండగా.. ఈ కొత్త భవనంలో 54కు పెంచారు. ఇందులో అదనపు విండోలు ఏర్పాటు చేయడంతో.. వీసాల కోసం వేచి ఉండే అవస్థ చాలావరకూ తగ్గుతుంది. ఈ కొత్త కాన్సులేట్‌లో మరింత మంది సిబ్బందిని నియమించి.. గతంలో కంటే వేగంగా, ఎక్కువగా వీసాలు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జెన్నిఫర్‌ వెల్లడించారు. హైదరాబాద్‌లో వాణిజ్యానికి సంబంధించి, ఈ కొత్త కాన్సులేట్ దోహదపడుతుందని మంత్రి కేటీఆర్ కూడా ట్విటర్ ద్వారా తెలిపారు.

Show comments