Site icon NTV Telugu

Free Entry at Charminar, Golconda: ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. నగరవాసులకు కేంద్రం బంపర్‌ ఆఫర్‌

Free Entry At Charminar, Golconda

Free Entry At Charminar, Golconda

నగర ప్రజలకు కేంద్రం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. 5 నుంచి 15వ తేదీవరకు అంటే 10 రోజుల పాటు చార్మినార్, గోల్కొండ కోటకు ప్రవేశ రుసుము లేకుండానే అనుమ‌తి ఇస్తున్న‌ట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఆఫర్‌ను 75వ స్వాతంత్ర్య దినోత్సవం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా చార్మినార్, గోల్కొండ కోటకు ఫ్రీగా సందర్శించేందుకు అవకాశం కల్పించేందుకు భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న అన్ని ఇతర స్మారక చిహ్నాలు, ప్రదేశాలను సందర్శకులకు ఉచితంగా ప్రవేశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉచిత ప్రవేశం ఆగస్టు 5 నుండి 15 వరకు చెల్లుతుంది. అయితే.. ఇది భారతీయులకే కాకుండా విదేశీయులకు కూడా అందుబాటులో ఉంటుందని, భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని సుమారు 3,400 ప్రాంతాల్లో ఆగస్టు 5 నుంచి 15వ తేదీ వరకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు.

read also: Free Entry at Charminar, Golconda: ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. నగరవాసులకు కేంద్రం బంపర్‌ ఆఫర్‌

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో నాలుగు స్మారక చిహ్నాలు ఉన్నాయి. వీటిలో నేటి నుంచి ఆగ‌ష్టు 5 నుంచి 15వ తేదీ వ‌ర‌కు ఉచితంగా ప్రవేశం క‌ల్పించ‌నున్నట్లు కిష‌న్ రెడ్డి పేర్కొన్నారు. అయితే.. ఈ నెల 5 నుంచి 15 వరకు ఫ్రీ ఎంట్రీకి చాన్స్ ఉంటుందని వెల్లడించింది. ఈ జాబితాలో మన రాష్ట్రం నుంచి చార్మినార్, గోల్కొండ కోట, వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట, పిల్లల మర్రి, రామప్ప ఆలయం ఉన్నాయి.

Exit mobile version