NTV Telugu Site icon

Ashada Bonalu 2023: నేటినుంచే ఆషాడ బోనాలు షురూ.. గోల్కొండ అమ్మవారికి తొలి బోనం!

Golconda Bonalu

Golconda Bonalu

2023 Ashada Masam Bonalu Starts From Today: జంట నగరాలు హైద‌రాబాద్, సికింద్రాబాద్‌లలో ‘బోనాల పండగ’ సందడి మొదలుకాబోతుంది. భాగ్యనగరంలో ఆషాఢ బోనాల జాత‌ర నేటినుంచి ప్రారంభం కానుంది. ముందుగా గోల్కొండ బోనాలు (Golconda Bonalu 2023) ప్రారంభం కానున్నాయి. లంగర్ హౌస్‌లో గోల్కొండ బోనాల తొట్టెల ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ ఊరేగింపులో తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ పాల్గొంటారు. వీరు తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవం ప్రారంభం కానుంది. జులై 10న ఊరేగింపు నిర్వహిస్తారు. మరోవైపు పాతబస్తీలో బోనాల ఉత్సవం జులై 16న ప్రారంభం కానుండగా.. జులై 17న ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహించనున్నారు. మొత్తంగా నెల రోజుల పాటు బోనాల జాతర సందడి ఉండనుంది.

Also Read: Gold Price Today: వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. నేడు హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

బోనాల పండుగను ఆషాఢ మాసంలో నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పండగను ప్రజలు జరుపుకుంటారు. బోనాల్లో భాగంగా ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. ఇక ఈఏడాది బోనాల పండుగకు జంట నగరాల్లో అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. బోనాల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ప్రతి ఏడాది ఈ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా జరుపుతుంది. ఈ సంవత్సరం బోనాల ఉత్సవాల నిర్వహణకు 15 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆషాడ బోనాల ఉత్సవాలతో హైద‌రాబాద్, సికింద్రాబాద్‌లు నెల రోజుల పాటు సందడిగా మారనున్నాయి.

Also Read: Anchor Lasya : వంటలక్కగా మారిన లాస్య.. కట్టెల పొయ్యి పై కష్టపడుతూ…

Show comments