ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ నిన్న, నేడు తెలంగాణలో పర్యటించిన విషయం విధితమే. అయితే.. నిన్న వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ‘రైతు సంఘర్షణ’ సభలో పాల్గొన్న రాహుల్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్, బీజేపీ, ఓవైసీలకు ఛాలెంజ్ విసరడానికే తాను రాష్ట్రానికి వచ్చినట్లు ఆయన వ్యాఖ్యానించారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ స్పందిస్తూ.. తెలంగాణాకు ఎవరైనా రావొచ్చన్న అసద్.. రాహుల్‌కు తెలంగాణ గురించి ఏమీ తెలియదన్నారు.
అంతేకాకుండా.. ఏం మాట్లాడాలో అని అడిగిన రాహుల్ వీడియో బయటకి వచ్చిందని, జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్ రిజల్ట్ చూశాం, వచ్చే ఎన్నికల్లో రాహుల్ కూడా ఓడిపోతారన్నారు. అంతేకాకుండా దమ్ముంటే హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అసదుద్దీన్ సవాలు విసిరారు. ఎలాగూ కేరళలోని వయనాడ్ లో రాహుల్ ఓడిపోవడం ఖాయమని.. హైదరాబాద్ లేదంటే మెదక్ లో పోటీ చేసి రాహుల్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
