NTV Telugu Site icon

Asaduddin Owaisi: పీఎఫ్‌ఐని నిషేధించారు.. మరి వారి సంగతి..?

Asaduddin Owaisi

Asaduddin Owaisi

అతివాద సంస్థ ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా'(పీఎఫ్ఐ)ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది… సంస్థ సభ్యులకు ముష్కర ముఠాలతో సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) కింద ఈ మేరకు చర్యలు తీసుకుంది… తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని.. ఐదేళ్ల పాటు నిషేధం కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది కేంద్రం.. పీఎఫ్ఐతో పాటు దాని అనుబంధ సంస్థలను సైతం నిషేధిత జాబితాలో చేర్చింది. పీఎఫ్ఐ వ్యవస్థాపకుల్లో చాలా మంది నిషేధిత సిమీ ఉగ్రవాద సంస్థ సభ్యులేనని పేర్కొన్న కేంద్ర హోంశాఖ.. వీరికి జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్(జేఎంబీ)తో లింకులు ఉన్నాయంటోంది.. అయితే, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు స్వాగతిస్తున్నారు.. మరికొందరు దీనిని వ్యతిరేకిస్తున్నారు.. పీఎఫ్‌ఐని నిషేధించారు… కానీ, ఖాజా అజ్మేరీ బాంబు పేలుళ్ల దోషులతో సంబంధం ఉన్న సంస్థలు ఎందుకు నిషేధించలేదు ? అని ప్రశ్నించారు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్ ఒవైసీ..

Read Also: Gautam Adani: మళ్లీ మూడో స్థానానికి పడిపోయిన అదానీ.. కారణం ఇదే..

మితవాద మెజారిటీ సంస్థలను ప్రభుత్వం ఎందుకు నిషేధించలేదు? అని నిలదీశారు ఒవైసీ.. నేను పీఎఫ్‌ఐ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాను.. ప్రజాస్వామ్య విధానాన్ని సమర్ధిస్తూనే ఉన్నా.. కానీ, పీఎఫ్‌ఐపై ఈ నిషేధానికి మద్దతు ఇవ్వలేం అన్నారు.. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై ఐదేళ్ల నిషేధాన్ని ఖండిస్తూనే.. తన స్టాండ్ పీఎఫ్‌ఐకి కూడా అనుకూలంగా లేదని స్పష్టం చేశారు. ఈ రకమైన కఠినమైన నిషేధం ప్రమాదకరమని, అది తన అభిప్రాయాన్ని చెప్పాలనుకునే ముస్లింలపై నిషేధం అని అన్నారు. “భారతదేశం యొక్క ఎన్నికల నిరంకుశత్వం ఫాసిజానికి చేరువవుతున్న విధంగా, ప్రతి ముస్లిం యువకుడు ఇప్పుడు భారతదేశపు నల్ల చట్టం యూఏపీఏ కింద పీఎఫ్‌ఐ కరపత్రంతో అరెస్టు చేయబడతారు అంటూ ట్వీట్‌ చేశారు.

ముస్లింలు కోర్టులు నిర్దోషులుగా ప్రకటించబడక ముందు దశాబ్దాలుగా జైలు జీవితం గడిపారు. నేను యూఏపీఏని వ్యతిరేకించాను.. దాని కింద అన్ని చర్యలను ఎప్పుడూ వ్యతిరేకిస్తాను. ఇది రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో భాగమైన స్వేచ్ఛ యొక్క సూత్రానికి విరుద్ధంగా నడుస్తుంది అంటూ మరో ట్వీట్ చేశారు.. 2020లో హత్రాస్‌కు వెళ్లే సమయంలో అరెస్టయిన కేరళ జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ కేసును ప్రస్తావిస్తూ, ఈ కేసు కప్పన్ టైమ్‌లైన్‌ను కూడా అనుసరిస్తుందని, ఇక్కడ ఎవరైనా కార్యకర్త లేదా జర్నలిస్ట్ యాదృచ్ఛికంగా అరెస్టు చేయబడి బెయిల్ పొందడానికి 2 సంవత్సరాలు పడుతుందని ఒవైసీ అన్నారు. ఒక దళిత మహిళపై సామూహిక అత్యాచారం మరియు హత్య గురించి నివేదించడానికి కప్పన్ హత్రాస్‌కు వెళ్తున్నాడు. ఆయనపై యూఏపీఏ కింద ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. రెండేళ్ల జైలు జీవితం తర్వాత ఆయనకు బెయిల్‌ వచ్చిందని గుర్తుచేశారు.