NTV Telugu Site icon

Gaddar Party: ‘గద్దర్ ప్రజా పార్టీ’గా.. గద్దర్ కొత్త పార్టీ

Gaddar

Gaddar

Gaddar Party: ఎన్నో ఏళ్లుగా విఫ్లవ రాజకీయాల్లో ఉన్న ప్రజా గాయకుడు గద్దర్‌ ఇపుడు బ్యాలెట్‌ రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని .. అదీ సీఎం కేసీఆర్‌పైనే పోటీ చేస్తానని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా గత ఏడాదిలో జరిగిన మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఆయన అక్కడి నుంచి పోటీ చేయాలని భావించి కేఏ పాల్‌ స్థాపించిన ప్రజా శాంతి పార్టీలో సైతం చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇపుడు ప్రజా గాయకుడు గద్దర్‌ బుల్లెట్‌ మార్గాన్ని వదిలి బ్యాలెట్‌ బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఆయన కొత్తగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి పార్టీని రిజిస్ర్టేషన్‌ చేయాలని భారత ఎన్నికల సంఘానికి బుధవారం ఆయన దరఖాస్తు సమర్పించారు. ప్రజా పాలన కోసం తన నేతృత్వంలో ”గద్దర్‌ ప్రజా పార్టీ”ని ఏర్పాటు చేస్తున్నట్టు గద్దర్‌(గుమ్మడి విఠల్‌) తెలిపారు. ఢిల్లీలో ఎన్నికల సంఘంలో రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Read also: Lovers Romance Viral Video: గట్టిగా హత్తుకుని ముద్దులు.. బైక్‌పైనే లవర్స్ ఘాటు రొమాన్స్! 21 వేల ఫైన్

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో కేసీఆర్‌ చెప్పినట్టు బంగారు తెలంగాణ నిర్మితం కాలేదని, పుచ్చిపోయిన తెలంగాణ లా రాష్ట్రం పరిస్థితి తయారైందని గద్దర్‌ విమర్శించారు. ధరణి పేరుతో సీఎం భూములను మింగేశారని గద్దర్‌ ఆరోపించారు. దోపిడోళ్ల పార్టీని అధికారం నుంచి దింపేయాలన్న లక్ష్యంతోనే కొత్తపార్టీ పెడుతున్నట్టు చెప్పారు. ఐదేళ్లు అజ్ఞాతంలో గడిపిన తాను ఇప్పుడు పార్లమెంటరీ మార్గంలోకి వచ్చానని .. ఓటు యుద్ధంలో దేశాన్ని దోచుకుంటున్న వారిపై పోరాటడానికి, కోట్లాది మందిని కదిలించడానికి మళ్లీ ప్రజల్లోకి వచ్చానని గద్దర్‌ తెలిపారు. ప్రజాలారా నన్ను సాధుకున్నా.. చంపుకొన్న మీరే నని గద్దర్‌ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని.. ఎవరితో వెళ్ళాలి, ఎలా వెళ్లాలనేది ప్రజలే నిర్ణయిస్తారన్నారు. కేసీఆర్‌పై పోటీ చేస్తానని గతంలో గద్దర్‌ ప్రకటించిన విషయాన్ని విలేకరులు ప్రశ్నిచంగా.. ఆ రోజు తన వ్యక్తిగతమైన ప్రకటన చేశానని.. ఇప్పుడు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సమాధానమిచ్చారు. గద్దర్‌ ప్రజాపార్టీ జెండా మూడు రంగులతో ఉండనుందని.. అందులో పిడికిలి గుర్తు ఉంటుందని తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా గద్దర్‌ ప్రధాన కార్యదర్శిగా నరేష్‌ పేర్లతో ఎన్నికల సంఘంలో రిజిస్ర్టేషన్‌ చేయించినట్టు తెలిసింది.