Arunodaya Naganna Passes Away : మూగబోయిన విప్లవ గళం.. అరుణోదయ నాగన్న కన్నుమూత.!

  • అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన ప్రజా గాయకుడు
  • విప్లవ ఉద్యమాలకు పాటలతో ఊపిరి పోసిన నాగన్న
  • అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యకు తీరని లోటు
Arunodaya Raganna

Arunodaya Raganna

Arunodaya Naganna Passes Away : ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ విప్లవ గాయకుడు, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకుడు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు నాగన్న (అరుణోదయ నాగన్న) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. నాగన్న మృతి విప్లవోద్యమానికి, ప్రజా సాంస్కృతిక రంగానికి తీరని లోటుగా మారింది. తన అద్భుతమైన గొంతుతో, ఆటపాటలతో దశాబ్దాల పాటు ప్రజలను చైతన్య పరిచిన ఆయన మరణవార్త విని ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజా సంఘాల నాయకులు, కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

నాగన్న తన జీవితాన్ని ప్రజా పోరాటాలకు, విప్లవ సిద్ధాంతాల వ్యాప్తికే అంకితం చేశారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ద్వారా అణచివేతకు వ్యతిరేకంగా, శ్రమజీవుల పక్షాన నిలబడి ఎన్నో విప్లవ గీతాలను ఆలపించారు. పల్లె పల్లెనా ఆయన పాడిన పాటలు ఎంతోమందిలో పోరాట స్ఫూర్తిని రగిల్చాయి. భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన ఉద్యమాల్లో తన పాటలతో ప్రజలను ముందుండి నడిపించారు. ప్రజా గాయకుడిగా ఎనలేని కీర్తిని సంపాదించుకున్న నాగన్న మృతికి సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ, అరుణోదయ ప్రతినిధులు , విప్లవ అభిమానులు ఘన నివాళులర్పిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు తమ గాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.