Mahbubnagar: మహబూబాబాద్ జిల్లా ల్లోని లోక్ సభ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 20 రోజులు ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది. మహబూబాబాద్ లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో జరిగే మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు దీని పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల వారీగా ఏర్పాట్లు చేయాల్సిన టేబుల్ లను సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభిస్తారు. ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి 14 టేబుల్ చొప్పున మొత్తం 98 ని ఏర్పాటు చేశారు. పార్లమెంటరీ పరిధిలో ప్రతి రౌండ్ కు 98 ఈవీఎం లను లెక్కిస్తారు. మొత్తంగా 132 రౌండ్లలో ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత చివరి ఫలితం తెలుస్తుంది. అత్యధికంగా ములుగు శాసనసభ నియోజకవర్గంలో 22 ,అత్యల్పంగా భద్రాచలంలో 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఏడు నియోజకవర్గాలకు కలిపి దాదాపుగా 750 మంది ఉద్యోగులు లెక్కింపులో పాల్గొననున్నారు.
Read More: Kalki 2898 AD : రాంచరణ్ కూతురికి కల్కి టీం స్పెషల్ గిఫ్ట్..
తొలత భద్రాచలం నియోజకవర్గం లో లెక్కింపు పూర్తవుతుంది చివరిగా ములుగు నియోజకవర్గ పూర్తయిన తర్వాతే విజేత ఎవరనేది తెలుస్తుంది. హోం ఓటింగ్ పోస్టల్ బ్యాలెట్ లను లెక్కించేందుకు ప్రత్యేక గదిని ఏర్పాటు చేస్తున్నారు ఈ ఓట్ల లెక్కింపు 12 టేబుల్ లపై ఏఆర్ఓ సమక్షంలో నిర్వహిస్తారు. ఈవీఎంలలో ఓటు లెక్కింపు పూర్తయిన తర్వాత వీవీ ప్యాడ్లలోనే స్లిప్ లను లెక్కిస్తారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మూడు అంచల భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు కేంద్ర బలగాలకు సంబంధించిన 600 మంది అధికారులు సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. లెక్కింపు నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. మహబూబాబాద్ నుంచి ఈదులపూసపల్లి మీదుగా కేసముద్రం,గూడూరు, వెళ్లే ప్రయాణికులు రామచంద్రపురం కాలనీ గుండా ఎస్వీ విద్యాలయం పక్క నుంచి వెళ్లేలా ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు.
Warangal: వరంగల్ లోకసభ ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి..