NTV Telugu Site icon

Agniveer Jobs 2024: అగ్నివీర్​ రిక్రూట్​మెంట్​ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుకు లాస్ట్ డేట్..!

Agniveer Jobs 2024

Agniveer Jobs 2024

Agniveer Jobs 2024: సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయం ‘అగ్నిపథ్’ పథకం కింద 2024-25 సంవత్సరానికి ఫైర్‌మెన్‌ల నియామకానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 13న ప్రారంభమైంది. కాగా దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ మార్చి 22. పరీక్షలు ఏప్రిల్ 22 నుండి నిర్వహించబడతాయి. అవివాహిత పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తదుపరి దశలో ఫిజికల్ ఈవెంట్‌లు, వైద్య పరీక్షలు నిర్వహించబడతాయి. ఎంపికైన వారు నాలుగేళ్ల పాటు ఇండియన్ ఆర్మీలో ఫైర్‌మెన్‌గా పనిచేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన ముఖ్యమైన వివరాల కోసం ఇక్కడ తనిఖీ చేయండి…

ముఖ్య వివరాలు:

* రిక్రూట్‌మెంట్ ప్రకటన – ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్, సికింద్రాబాద్.

పోస్టులు – అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్ నియామకం.

* పోస్టులు – అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్, అగ్నివేర్ ట్రేడ్స్ మ్యాన్.

* అర్హత -అగ్నివీర్ జనరల్ డ్యూటీ పోస్టుకు కనీసం 10వ తరగతి 45 మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నికల్ పోస్టులకు ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఐటీఐ కూడా ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను పరిశీలిస్తే..60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత. ట్రేడ్స్‌మన్‌కు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

* వయోపరిమితి- 17.5 – 21 సంవత్సరాల మధ్య ఉండాలి.

* శారీరక ప్రమాణాలు – ఎత్తు 166 సెం.మీ. కొన్ని పోస్టులకు 162 సెం.మీ సరిపోతుంది. పెంచేటప్పుడు ఛాతీ సెం.మీ పెరగాలి. ఎత్తుకు తగిన బరువు కూడా ఉండాలి.

Read also: SRH Schedule 2024: ఫ్యాన్స్ గెట్ రెడీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్ ఇదే! ఉప్ప‌ల్‌లో ఎన్ని మ్యాచ్‌లంటే?

దరఖాస్తులు – ఆన్‌లైన్

* దరఖాస్తు రుసుము – రూ.250.

* దరఖాస్తులు తెరవబడతాయి – ఫిబ్రవరి 13, 2024.

* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ – మార్చి 22, 2024.

* ఎంపిక విధానం- ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. రిక్రూట్‌మెంట్ ర్యాలీ (ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్/ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్), మెడికల్ ఎగ్జామినేషన్ మరియు సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక ఉంటుంది.

* జీతాలు – అగ్ని వీర్‌గా ఎంపికైన వారు నాలుగేళ్ల పాటు ఆర్మీలో సేవలందించాల్సి ఉంటుంది. మొదటి ఏడాది నెలకు రూ.30,000, రెండో ఏడాది నెలకు రూ.33,000. మూడవ సంవత్సరంలో నెలకు 36,000 మరియు నాల్గవ సంవత్సరంలో నెలకు 40,000.

* ఆన్‌లైన్ పరీక్షల ప్రారంభం – 22. ఏప్రిల్ 2024.

* అధికారిక వెబ్‌సైట్ – https://joinindianarmy.nic.in
Andhra Pradesh: ఏపీలో కాంగ్రెస్ తో లెఫ్ట్ పార్టీల సమావేశం.. ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చ