Kunchala Prabhakar: సంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్ కి, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహాశివరాత్రిని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా బీరంగూడ శ్రీ భ్రమరాంభిక మల్లికార్జున స్వామి దర్శనానికి జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ వెళ్లారు. ఆలయంలోకి భక్తుల మధ్య నుంచి వీవీఐపీ వరుసలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ వెళ్తున్న క్రమంలో కాస్త తోపులాట జరిగింది. దీంతో.. డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బంది పట్ల జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్దు రుసుగా ప్రవర్తించారు. ఈనేపథ్యంలో కాసేపు అక్కడ వైస్ చైర్మన్ , పోలీస్ కానిస్టేబుల్ వాగ్వాదం తలెత్తింది. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ను జడ్పీ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్ అసభ్య పథకాలంతో దూషించడంతో భక్తులు షాక్‌కు గురయ్యారు.
Read also: Harish Rao: లోక్‌సభలో తెలంగాణ బిల్లు పాసై నేటికి 9 ఏళ్లు మంత్రి ట్విట్ వైరల్
పోలీసులపై దురుసుగా ప్రవర్తిస్తుంటే.. పోలీసు కానిస్టేబుల్ కూడా జడ్పీ వైస్ చైర్మన్ పై వేలు చూపిస్తూ.. వెళ్లు అంటూ గట్టిగా మాట్లాడుతూ దురుసుగా ప్రవర్థించడం చర్చ నీయాంశంగా మారింది. కానిస్టేబుల్ ప్రవర్తనకు ప్రభాకర్ సీరియస్ అయ్యారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆలయంలో వున్న సిబ్బంది, భక్తులు జడ్పీ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్ ను సర్ది చెప్పడంతో వ్యవహారం కాస్త సర్దు మనిగింది. అయితే ఘటన ఆలయ సిబ్బందికి తెలియడంతో వీవీఐపీ ఎంట్రీ వద్దకు చేరుకున్నారు. జడ్పీ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్ తో వాగ్వాదం చేసిన కానిస్టేబుల్ ను వెంటనే అక్కడి నుంచి మరో చోటుకు మార్చారు. అయితే.. ఆలయంలోనే వాగ్వాదం జరగడంతో కొద్దిసేపు వీవీఐపీ లైన్ వద్ద భక్తులకు ఇబ్బంది ఎదుర్కొ్న్నారు. లోనికి వెళ్లేందుకు కాస్త ఆలస్యం కావడంతో భక్తులు మండిపడ్డారు. ఎంతసేపని వేచి వుండాలని లోనికి అనుమతించండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పండుగపూట ఈగొడవలు ఏంటి ఆలయంలో అంటూ మండిపడ్డారు. ఈ సంఘటన ఆలయ కమిటీ చైర్మన్ తులసి రెడ్డి కళ్ల ముందే జరగడం ఆశ్చర్యానికి గురిచేసింది.
Hema Malini-Dharmendra: హేమమాలిని- ధర్మేంద్రకు తెలిసిన కిటుకు ఏమిటి?