Site icon NTV Telugu

Youth Arrested: చోరీలు చేస్తూ తెలంగాణలో పట్టుబడ్డ ఎపీకీ చెందిన యువకుడు

Untitled Design (9)

Untitled Design (9)

ఏపీకి చెందిన ఓ యువకుడు ఈజీ మనీ కోసం తెలంగాణలో చోరీలు చేస్తూ పట్టుబడ్డాడు. అయితే నిందితుడు పోటీ పరీక్షలు రాసినా.. ఉద్యోగం రాకపోవడంతో.. జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నాడు. అయితే సూర్యాపేట జిల్లాలోని వేపల సింగారంలో చోరీ చేసి పారిపోతుండగా.. పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం నిందితుడిని పీఎస్ కు తరలించారు.

Read Also: Suicide: పెళ్లి కావడం లేదని.. రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య..

పూర్తి వివరాల్లోకి ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం భీమవరం గ్రామానికి చెందిన పెనుగొండ మల్లికార్జున్ రెడ్డి బీటెక్ పూర్తి చేశాడు. కాంపీటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయినప్పటికి ఉద్యోగం రాలేదు. దీంతో జల్సాలు, ఈజీ మనీ కోసం చోరీలు చేస్తున్నాడు. అయితే దొంగతనం చేసిన సొమ్ముతో బెట్టింగ్ ఆడి.. డబ్బులు పొగొట్టుకునే వాడు. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం వేపలసింగారంలో దొంగతనానికి పాల్పడ్డాడు. గ్రామంలోని ముడెం గోపిరెడ్డి ఇంటికి తాళం వేసి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన మల్లికార్జున్ రెడ్డి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, రూ.90 వేల నగదు దొంగిలించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న హుజూర్‌నగర్ పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.

Read Also:Electric Bike: హీరో మోటోకార్ప్ సంస్థ నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్

చోరీ చేసిన సొమ్మును అమ్మేందుకు వెళుతుండగా.. అక్కడే వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో మల్లికార్జున్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. గతంలో ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని ప్రొద్దుటూరు, సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అమీనాబాద్‌లో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి నగదు, బంగారాన్ని దొంగిలించినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం నిందితుడి నుంచి 51.78 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2,85,000 నగదు, బైక్, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Exit mobile version