Site icon NTV Telugu

AP Jithender Reddy : టీఆర్ఎస్ ను చూసి ప్రజలు ఛీ కొడుతున్నారు

Jthender

Jthender

తెలంగాణలో బీజేపీ-టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. బీజేపీ నేతల్ని టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శిస్తే… బీజేపీ నేతలు తామేం తక్కువ తినలేదన్నట్టుగా మాటల దాడి చేస్తున్నారు. ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ ముంపు వాసుల నుంచి భూములు లాక్కుని, పునరావాసం, పరిహారం ఇవ్వలేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి అన్నారు. బీజేపీ ఎక్కడుందని అడుగుతున్న టీఆర్ఎస్ నేతలకు ఇక్కడికొచ్చిన జనమే సమాధానమని తెలిపారు. ఉదండాపూర్ ప్రాజెక్టు పనులేమయ్యాయని ఆయన ప్రశ్నించారు.

టీఆర్ఎస్ ను చూసి ఉదండాపూర్ ప్రజులు ఛీ కొడుతున్నారని నిప్పులు చెరిగారు. మోదీ పాలనలో నీతి వంతమైన ప్రభుత్వం కొనసాగుతోందని అన్నారు. 18 రాష్ట్రాల్లో బీజేపీ పాలన ఉందని, ఎక్కడా మత కల్లోలాలు, అవినీతి లేదని గుర్తు చేశారు. తెలంగాణలో 80 శాతం హిందువులున్న చోట మాట్లాడుతుంటే మతతత్వం రెచ్చగొడుతున్నరని అంటారా? అని ప్రశ్నించారు. పాలమూరు ప్రజలు కలలు కన్న రైలు లైన్ పనులు పూర్తి చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీదే నని ఆయన అన్నారు.

Gas Cylinder: మోడీ వచ్చాక పెరిగిన ధర ఎంతో తెలుసా?

Exit mobile version