NTV Telugu Site icon

Medical Student Preeti: మళ్లీ తెరపైకి మెడికో ప్రీతి కేసు.. నిందితుడు సైఫ్‌కు సస్పెన్షన్ పొడిగింపు

Nedico Prethi

Nedico Prethi

Medical Student Preeti: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న ధరావత్ ప్రీతి గతేడాది ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సీనియర్ విద్యార్థిని వేధింపులతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంతలో ఆమె కేసు మరోసారి తెరపైకి వచ్చింది. కాకతీయ మెడికల్ కళాశాల పీజీ మొదటి సంవత్సరం అనస్థీషియా విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్య కేసు విచారణలో యాంటీ ర్యాగింగ్ కమిటీ నిన్న (సోమవారం) పునఃవిచారణ జరిపి సైఫ్ సస్పెన్షన్ కొనసాగించాలని నిర్ణయించింది. ప్రీతిని వేధించాడని సెకండియర్ అనస్థీషియా విద్యార్థి సైఫ్ అలీపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఉందని నమ్మిన కమిటీ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ సస్పెన్షన్ సరైన దిగా మరోమారు తీర్మానించింది.

Read also: Rangareddy Crime: దారుణం.. 20 రూపాయల కోసం కన్నతల్లినే కిరాతకంగా చంపిన కొడుకు..

తాను రిమాండ్ లో ఉన్న సమయంలో యాంటీ ర్యాగింగ్ కమిటీ తనను విచారించకుండానే తీర్మానం చేసినట్లు సైఫ్ అలీ హైకోర్టులో తెలియజే యడంతో న్యాయమూర్తి నిందితుడిని సైతం విచారించి తగు తీర్మానం చేయాలని సూచిస్తూ ఆదేశాలు జారీ చేయడంతో పునఃవిచారణ చేపట్టారు. మొదటిసారి విచారణకు హాజరు కాకపోవడంతో వాయిదా వేసి, మరో అవ కాశాన్ని కల్పించింది. నిన్న (సోమవారం) మరోసారి నిందితుడి తరపు లాయర్ ముందే విచారించిన కమిటీ గతంలో చేసిన తీర్మానం సరైనదేనని తేల్చుతూ మరో తీర్మానం చేసింది. దాంతో పాటుగా కోర్టు ఉత్తర్వుల అనంతరం విచారణకు హాజరుకాకుండా విధులకు హాజరైన 97 రోజుల కాలాన్ని సైతం కలుపుకొని 2024 జూన్ 8వ తేదీ వరకు సస్పెన్షన్ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు కేఎంసీ ప్రిన్సిపా ల్ మోహన్దాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

Read also: Devara Glimpse Records: ఇది ‘దేవర’ క్రేజ్… అన్నీ ఎరుపెక్కాయి!

గతేడాది 2023 ఫిబ్రవరి 22న సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులకు తాళలేక ప్రీతి ఎంజీఎం ఆస్పత్రిలో ఆత్మహత్యకు ప్రయత్నించింది. విషం ఇంజక్షన్ వేసుకుని నిమ్స్ లో చికిత్స పొందుతూ అదే నెల 26న మృతి చెందింది. ప్రీతి ఆత్మహత్య ఘటనపై పెద్ద దుమారం రేగడంతో.. పోలీసులు సైఫ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. ఏడాది పాటు తరగతులకు హాజరుకాకుండా కేఎంసీ ర్యాగింగ్ నిరోధక కమిటీ నిర్ణయం తీసుకుంది. కమిటీ నిర్ణయానికి వ్యతిరేకంగా సైఫ్ హైకోర్టును ఆశ్రయించగా, తాత్కాలికంగా సస్పెన్షన్ ఎత్తివేయబడింది. నవంబర్ 9న హైకోర్టు ఆదేశాల మేరకు యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం నిర్వహించగా.. సైఫ్ హాజరై ప్రీతి ఆత్మహత్య ఘటనను వివరించారు. దీనిపై చర్చించిన కమిటీ సభ్యులు సైఫ్ పై వచ్చిన ఆరోపణలు నిజమేనని కోర్టుకు వెల్లడించారు. ఈ క్రమంలో కమిటీ విధించిన సస్పెన్షన్‌ను కొనసాగించవచ్చని కోర్టు తెలిపింది.