NTV Telugu Site icon

Hyderabad Crime: గాలిపటం ఎగురవేస్తూ యువకుడి బలి.. ఆరుగురు స్నేహితులపై అనుమానం

Chuhan

Chuhan

Hyderabad Crime: నగరంలో గాలి పటానికి మరో యువకుడు బలయ్యాడు. తెలంగాణలో ఇప్పటికీ ఏడుగురు మృతి చెందగా.. ఇప్పుడు చౌహన్ దేవ్ మృతితో సంఖ్య ఎనిమిదికి చేరింది. మధురానగర్ లో ఐదంతస్తుల భవనం పైనుంచి యువకుడు కింది పడిపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. అయితే అప్పటి వరకు 7 గురు స్నేహితులు బాగానే ఉండి గాలి పటం ఎగురవేసేందుకు ఐదవ అంతస్తుపై తీసుకుని వెళ్లారు. అయితే అక్కడ బాగానే కాసేపు గాలిపటం గురించి చర్చ జరిగింది. కాగా.. ఇంతలో ఏమైందో ఏమో గాని ఒక్కసారిగా చౌహాన్ ఒక్కసారిగా అరుస్తూ ఐదవ అంతస్తునుంచి కిందికి పడిపోయాడు. అయితే స్నేహితులు ఖంగారు పడి కిందికి పరుగులు పెడుతూ వచ్చారు. అయితే అప్పటికే చౌహన్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న చౌహన్ కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటన ప్రాంతం వద్దకు వచ్చారు. చౌహాన్ ను విగితజీవిగా చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.

Read also: Ustaad: రాకింగ్ స్టార్ తో సందడి చేయనున్న థ్రిల్లింగ్ స్టార్…

కొద్ది క్షణం ముందే తమ కంటి ముందు వున్న కన్న కొడుకు ఇలా విగతజీవితగా కనిపించడంతో గుండెలు బాదుకుని రోందించారు. చౌహాన్ మృతిపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. చౌహాన్ గాలిపటం ఎగురవేస్తూ మృతి చెంది ఉండడని, రహ్మత్ నగర్‌లోని ఆరుగురు స్నేహితుల మీద కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మధురానగర్ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా మధుర నగర్ పోలీసులు. అయితే చౌహాన్ నిజంగానే గాలిపటం ఎగురవేస్తూ.. కిందికి పడ్డాడా? లేక ఎవరైనా తోసేసారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
GVL Narasimha Rao: SBI-CSR నిధులతో సంక్రాంతి వేడుకలు.. సీపీఎంపై జీవీఎల్‌ కౌంటర్‌ ఎటాక్‌