Site icon NTV Telugu

రియల్టర్ హత్య కేసులో మరో ట్విస్ట్..!

రియల్టర్ హత్య కేసులో నిందితుడైన నెల్లూరు బాబా లోక్నాథ్ ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు బాబా అలియాస్ గురూజీ అలియాస్ త్రిలోక్ నాది సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాబా తో పాటు మరోకరని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ కు చెందిన రియల్టర్ విజయ భాస్కర్ రెడ్డి హత్య కేసులో నెల్లూరు బాబా కీలక సూత్రధారి.. తన శిష్యబృందంతో కలిసి కిడ్నాప్ చేసి హత్య చేసిన సంఘటన లో బాబా ను అరెస్ట్ చేశారు.

రియల్టర్ హత్య తర్వాత బాబా కనిపించకుండా పోయాడు . బాబా ను పట్టుకునేందుకు కోసం మొత్తంగా నాలుగు రాష్ట్రాల్లో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గత 15 రోజుల నుంచి పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో బాబా తో పాటు మరొకరిని సైబరాబాద్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వెల్లడించారు. ఈ హత్య కేసులో ఇప్పటికే నలుగురిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.

Exit mobile version