NTV Telugu Site icon

Anganwadi Eggs: అంగట్లో అమ్మకానికి అంగన్వాడి కోడిగుడ్లు.. సంగారెడ్డి నుంచి తెచ్చిన వ్యాపారి..!

Sangareddu Anganwadi Eggs

Sangareddu Anganwadi Eggs

Anganwadi Eggs: చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే అంగన్‌వాడీ కోడి గుడ్లను అంగట్లో అమ్మడానికి పెట్టిన వైనం వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్రంలో సంచలనంగా మారింది. ప్రభుత్వం ఇచ్చే అంగన్ వాడీ గుడ్లకు మార్క్ వేసి వాటిని కేంద్రాలకు సరఫరా చేస్తోంది. అయితే.. వాటిని గమనించకుండా కొందరు అంగళ్లకు అమ్మకుంటున్నారు. దీంతో గుడ్లకు మార్క్ వున్న గమనించకుండా షాపు యజమానులు నేరుగా అంగన్వాడి కేంద్రాల నుంచి తెచ్చుకుంటున్నారు. అంతేకాడు.. వాటిని బహిరంగంగా విక్రయిస్తున్నారు. చిన్నారులు, గర్భిణులకు గుడ్లు, పౌష్టికాహారం పక్కదారి పట్టి కిరాణా దుకాణాలకు చేరుతున్నాయి. చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు అంగన్వాడి సెంటర్ల ద్వారా నిత్యం ఇచ్చే కోడిగుడ్లను బహిరంగంగా మార్కెట్లో అమ్మకానికి ఓ వ్యాపారి పెట్టాడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఒక కోడిగుడ్డు ధర రూ.5 అని బోర్డు పెట్టి అమ్ముకుంటున్నాడు.

Read also: Vemulawada Temple: రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు..

అయితే కోడిగుడ్లను కొనుగోలు చేసిన వారు అంగన్ వాడీ గుడ్లుగా గుర్తించిన కొందరు తన దుకాణాల్లోకి గుడ్లు ఎలా వచ్చాయని వ్యాపారిని ప్రశ్నించాడు. అయితే ముందు తెలియదని చెప్పినా వ్యాపారిని గట్టిగా అడగడంతో సంగారెడ్డి నుంచి తెచ్చినట్లు తెలిపాడు. అంగన్ వాడీ వాల్లే తమకు సంప్రదించి కోడి గుడ్లను ఇచ్చినట్లు తెలిపాడు. అయితే ప్రభుత్వం నుంచి అంగన్ వాడీకి పిల్లలకు, గర్భణీలకు చేరవలసిన గుడ్లు పక్కదారి పడుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. దీనిని అధికారులు గుర్తించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా సంగారెడ్డి నుంచి వచ్చినట్లు వ్యాపారి తెలిపాడని, అతనికి ఎవరు విక్రయించారో తెలుసుకోవాలని కోరారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Gangula Kamalakar: డిసెంబర్ 9న రుణమాఫీ అన్నారు… ఏమైంది..?