NTV Telugu Site icon

Andole Mla Kranthi kiran: సింగూరు ప్రాజెక్టుని సందర్శించిన ఎమ్మెల్యే క్రాంతికిరణ్

Mla Kranthi

Mla Kranthi

తెలంగాణ వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు సింగూరు జలాశయం నిండు కుండలా మారింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో మూడు గేట్లు ఎత్తి 34 వేల క్యూసెకుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సింగూరు ప్రాజెక్టు ను సందర్శించారు. ప్రాజెక్టు ఔట్ ఫ్లో, ఇన్ ఫ్లో వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సింగూరు ప్రాజెక్టులోకి మరో 35 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో భారీగా నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అవడంతో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలంటూ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్ క్రాంతికిరణ్‌ సూచించారు .ప్రాజెక్టు నిండు కుండను తలపించడంతో సింగూరు పరిసర ప్రాంతాల ఆయకట్టు రైతుల కళ్ళలో సంతోషం కనిపిస్తుందని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ అన్నారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి కనుక ఇక్కడి అనేక సంక్షేమ పథకాలు రైతులకు అందిస్తున్నారని తెలిపారు. మరోవైపు సిద్దిపేట జిల్లా తొగుటలోని మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతోంది. మల్లన్న సాగర్ నుండి మూడు పంపుల ద్వారా కొండపోచమ్మ సాగర్ కు నీటిని పంపింగ్ చేస్తున్నారు అధికారులు.

మంజీరా డ్యామ్ A.G.M అజీముద్దీన్ ఎన్టీవీతో మాట్లాడుతూ.. సింగూరు ప్రాజెక్టు నుంచి భారీగా వరద మంజీరాకు వస్తుందన్నారు. ఇన్ ఫ్లో సింగూరు నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి వరద వస్తుందన్నారు. సింగూరు నుంచి 35 వేలు ఇన్ ఫ్లో వస్తే అవుట్ ఫ్లో 36 వేల క్యూ సెక్కులు బయటికి వదులుతున్నాం అని చెప్పారు. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని, పశువులు కాసే వారు మంజీరా నది దగ్గరకు రావద్దన్నారు. మరో వారం రోజులు ఇలాగే వరద వస్తుందన్నారు.

Viral Video Of Girl Crying: ఫన్నీ వీడియో.. అట్లుంటది ఈ పిల్లతోని