Site icon NTV Telugu

Anchor Swetcha : నా భర్త నిర్దోషి, అమాయకుడు.. తెరపైకి నిందితుడు పూర్ణచందర్‌ భార్య స్వప్న

Anchor Swetcha

Anchor Swetcha

Anchor Swetcha : తెలుగు న్యూస్‌ రీడర్‌, యాంకర్‌ స్వేచ్ఛ వోటార్కర్‌ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. యాంకర్‌ స్వేచ్ఛ కేసులో నిందితుడు పూర్ణచందర్‌ భార్య స్వప్న తెరపైకి వచ్చింది. పూర్ణ చందర్‌ ద్వారానే స్వేచ్ఛ పరిచయమైందని స్వప్న పేర్కొంది. వారిద్దరి మధ్య సంబంధం నాకు తెలియదని, వారిద్దరి వ్యవహారం తెలిశాక పూర్ణను వదిలేశానని స్వప్న వివరించింది.

Hydra: మాదాపూర్ లోని సున్నం చెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు..

అంతేకాకుండా.. పూర్ణచందర్‌పై స్వేచ్ఛ కూతురు అరణ్య చేస్తున్న ఆరోపణలు అసత్యమని, అరణ్యను పూర్ణచందర్‌ సొంత కూతురిలా చూసుకున్నాడని స్వప్న పేర్కొంది. స్వేచ్ఛ నన్ను మానసికంగా టార్చర్‌ చేసిందని స్వప్న ఆరోపించింది. స్వేచ్ఛ పూర్ణచందర్‌ను బ్లాక్‌మెయిల్‌ చేసిందని, నా పిల్లలను కూడా అమ్మా అని పిలవాలని భయపెట్టిందని స్వప్న చెప్పుకొచ్చింది. నా భర్త నిర్దోషి, అమాయకుడు అని స్వప్న వెల్లడించింది.

Keerthi Suresh : ఇంటర్ లోనే అతన్ని లవ్ చేశా.. కీర్తి సురేష్‌ షాకింగ్ కామెంట్స్

Exit mobile version