Amith Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు తెలంగాణకు రానున్నారు. రాత్రికి అమిత్ షా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నేషనల్ పోలీస్ అకాడమీకి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసిన అనంతరం రేపు నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగే పాసింగ్ ఔట్ పరేడ్ కు ముఖ్య అతిథిగా హాజరవుతారు. రేపు మధ్యాహ్నం సూర్యాపేటలో జనగర్జన సభలో పాల్గొంటారు. ఈ పర్యటనలో తెలంగాణలోని ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.
అమిత్ షా టూర్ షెడ్యూల్ ఇలా..
నేటి షెడ్యూల్..
* ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోనున్న అమిత్ షా..
* ఉదమం 10 గంటల 20 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా నేషనల్ పోలీస్ అకాడమిక్ చేరుకోనున్న అమిత్ షా..
* రాత్రికి పోలీస్ అకాడమీలో బస చేయనున్న అమిత్ షా
రేపటి షెడ్యూల్..
* 27 న ఉదయం 8 గంటలకు నేషనల్ పోలీస్ అకాడమీలో పోలీస్ అమరవీరుల స్థూపానికి పుస్పగుచ్చాలతో శ్రద్దాంజలి ఘటించనున్న అమిత్ షా..
* అనంతరం 11 గంటల వరకు ఐపీఎస్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొనున్నారు అమిత్ షా..
* ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నేషనల్ పోలీస్ అకాడమీలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనున్నారు అమీత్ షా..
* మధ్యాహ్నం ఒంటిగంట కు మధ్యాహ్న భోజనం అనంతరం 2: 35 గంటలకు రోడ్డు మార్గం ద్వారా బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు బయలుదేరనున్న అమిత్ షా…
* మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో సూర్యపేటలో జరిగే బిజెపి జన గర్జన సభకు వెళ్లనున్న అమిత్ షా..
* మధ్యాహ్నం 3:45 గంటలకు సూర్యాపేటకు చేరుకోనున్న అమిత్ షా…
* 3:55 గంటలకు జన గర్జన సభస్థలికి చేరుకోనున్న అమిత్ షా…
* 3:55గంటల నుంచి 4:45 వరకు జన గర్జన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్న అమిత్ షా…
* 5:00 గంటలకు సూర్యాపేట నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కు బయలుదేరనున్న అమిత్ షా..
* 5:45 కు బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్న అమిత్ షా
* 5:50 గంటలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకొని ఉన్న అమిట్ షా..
* 5:55 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి పయనం అవ్వనున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా…
