Tarun Chugh: ఆగస్టు 21న మునుగోడులో బీజేపీ బహిరంగ సభ జరగనుందని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ వెల్లడించారు. ఈ సభకు కేంద్ర మంత్రి అమిత్ షా హాజరవుతారని తెలిపారు. కేసీఆర్ పాలనలో జరుగుతున్న అన్యాయాలపై మాట్లాడుతారన్నారు. ప్రధాని మోడీ తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం అందరికీ అన్యాయం చేస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని మండిపడ్డారు. గత ఏడాదిగా తెలంగాణ ప్రజలు ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ ఎంపీలపై పోలీసులతో దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండ్రోజులుగా ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
Bhatti Vikramarka: కాళేశ్వరం ప్రాజెక్టును బరాబర్ సందర్శిస్తాం..
కేసీఆర్ చేతిలోనుంచి అధికారం పోతుందనే భయంతో వ్యవహారిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. పాదయాత్రపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. పోలీసులు సైతం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదన్నారు. కేసీఆర్ సాయంత్రం మాట్లాడే మాటలపై ఏం చెప్తామని తరుణ్ చుగ్ ఎద్దేవా చేశారు. ఈ నెల 26న కాకుండా 27న బండి సంజయ్ సంగ్రామ యాత్ర మూడో విడత ముగింపు సభ ఉంటుందన్నారు. జేపీ నడ్డా లేదా యోగి ఆదిత్యనాథ్ హాజరు అయ్యే అవకాశం ఉంది. అదే రోజు బీజేపీలో ఎర్రబెల్లి ప్రదీప్ రావు, బొమ్మ శ్రీరామ్ చేరే అవకాశం ఉంది.