Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Amit Shah To Hold Public Meeting In Telanganas Munugode On August 21st

Munugode bypoll: మునుగోడు సభపై క్లారిటీ ఇచ్చిన బీజేపీ..

Published Date :August 13, 2022 , 9:01 am
By Sudhakar Ravula
Munugode bypoll: మునుగోడు సభపై క్లారిటీ ఇచ్చిన బీజేపీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

మునుగోడులో బీజేపీ నిర్వహించే బహిరంగ సభపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 21న రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్నారని స్పష్టం చేశారు. మునుగోడు సభకు అమిత్ షా హాజరు అవుతారని, ఆయన సమక్షంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారని తెలిపారు. మునుగోడు సభను అమిత్ షా హాజరుకు వీలుగా ఉండేలా నిర్వహిస్తున్నామని, అందుకు ఆయనకు ఆగస్టు 21తో పాటు 29వ తేదీని కూడా సూచించినట్లు చెప్పారు. చివరగా 21నే సభ ఖరారైందని వివరించారు బండి సంజయ్.. మరోవైపు, తెలంగాణ రాజకీయాలన్ని ఇప్పుడు మునుగోడు బైపోల్ చుట్టూనే తిరుగుతున్నాయి. బీజేపీ చేరికల కమిటీ నియోజకవర్గంలో యాక్టివ్ అయింది. టీఆర్ఎస్ అసమ్మతి నేతలకు బీజేపీ నేతలు గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది.

Read Also: RSS: ప్రొఫైల్ పిక్చర్ మార్చిన ఆర్ఎస్ఎస్.. 75వ స్వాతంత్య్ర దినోత్సవం ముందు కీలక పరిణామం

మునుగోడు ఉప ఎన్నికకు ఒక వ్యుహం ప్రకారం కార్యాచరణతో బీజేపీ ముందుకెళ్తోంది. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా, అది ఆమోదించే నాటికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ యాత్ర మునుగోడుకు చేరుకునేలా ప్లాన్‌ చేశారు. ఆ నియోజవర్గ పరిధిలోని చౌటుప్పల్‌లో సభ నిర్వహించారు. అమిత్‌ షా నుంచి బండి సంజయ్‌ వరకు ఇప్పుడు అందరూ దృష్టి మునుగోడు పైనే కేంద్రీకరించారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గపరిధిలో 7 మండలాలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. చౌటుప్పల్‌, నారాయణపూర్‌, గట్టుప్పల్‌, చండూర్‌, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడ మండలాలు కాగా.. చౌటుప్పల్‌, చండూర్‌ మున్సిపాలిటీలుగా ఉన్నాయి. ఇక్కడ పార్టీ యంత్రాంగాన్ని ఉప ఎన్నికలకు సిద్ధం చేసేందుకు రాష్ట్ర నాయకులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తోంది బీజేపీ. మునుగోడు ఉపఎన్నికను కేంద్రపార్టీ నేరుగా పర్యవేక్షించనుంది. అటు కాంగ్రెస్ నేతలు కూడా మునుగోడులో పాదయాత్రతో రంగంలోకి దిగారు. ఈనెల 16 నుంచి గ్రామాల వారీగా రచ్చబండ నిర్వహించబోతున్నారు. మొత్తంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా , సీఎం కేసీఆర్ బహిరంగ సభలు వరుస రోజుల్లో జరుతుండటం మునుగోడు రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amit Shah
  • bjp public meeting
  • munugode
  • munugode bypoll
  • telangana

తాజావార్తలు

  • Macharla CI: పరువు హత్య కేసు.. మాచర్ల సీఐ వెంకటరమణ సస్పెన్షన్!

  • Pakistan: పెరిగిన పెట్రోల్ ధరలతో జనాగ్రహం.. అర్ధరాత్రి పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

  • Nelakota Hill Tiger: నేలకోట కొండపై తిష్ట.. స్థానికుల కంటపడిన మన్యం పులి!

  • Drug Party Busted: ‘ఈగల్ టీం’ మెరుపు దాడులు.. డ్రగ్స్ పార్టీలో దొరికిన బాలీవుడ్, టాలీవుడ్ నటులు..!

  • Hyderabad Crime: రియల్ “కేరళ స్టోరీ”.. ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లిచేసుకొని ఇస్లాం మతంలోకి మారాలంటూ..!

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions