Amit Shah: ముస్లీం రిజర్వేషన్లు తీసేస్తాం.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ ఈ పదేళ్ళలో అప్పుల తెలంగాణగా మారిందన్నారు. యువత, మహిళలు, అన్ని వర్గాలు ఈ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు రాష్ట్ర, దేశ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తప్పకుండా మోడీ కి, కమలం గుర్తుకు ఓటు వేస్తారన్నారు. లిక్కర్, గ్రానైట్, మియాపూర్ భూములు, ఓఆర్ఆర్ ఇలా ఈ ప్రభుత్వంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని అన్నారు. దళిత బందు డబ్బులను బీఆర్ఎస్ కార్యకర్తల తీసుకున్నారని తెలిపారు. కేసీఆర్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. దీంతో కేసీఆర్ విశ్వసనీయత కోల్పోయారని అన్నారు. సినిమా, ఫార్మా, ఎడ్యుకేషన్ సిటీలని ఏర్పాటు చేస్తానని చేయలేదన్నారు. మేము ఇచ్చిన హామీలు ఈ 9 ఏళ్లలో నెరవేర్చామన్నారు. 370 ఆర్టికల్ ఎత్తేసామని తెలిపారు. అయోధ్యలో రామాలయం, ట్రైబల్ తలక్ , గ్రామీణ రోడ్లు, ప్రతి పేద వ్యక్తికి 5 కిలోల ఉచిత బియ్యం, ఇల్లు ఇలా ఎన్నో చేస్తామని తెలిపారు. రాజ్యాంగ వ్యతిరేకంగా 4 శాతం ముస్లిం రిజర్వేషన్ లు ఇచ్చారని తెలిపారు. వీటిని ఎత్తి వేస్తామని స్పష్టం చేశారు. ఆ రిజర్వేషన్ లు బీసీ, ఎస్సీ, ఎస్టీ లకి ఇస్తామని క్లారిటీ ఇచ్చారు.
Read also: China Pneumonia: చైనాలో విస్తరిస్తున్న కొత్తరకం న్యుమోనియా.. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన!
వడ్లకు క్వింటాల్ కి 3,100 ఇస్తామన్నారు. బాయిల్డ్ రైస్ కూడా కొంటామని తెలిపారు. పెట్రోల్, డీజిల్ పై వాట్ తగ్గిస్తామన్నారు. విద్యార్థునులకి ఫ్రీ లాప్ టాప్ ఇస్తామని తెలిపారు. తెలంగాణ ఆందోళనను అణచివేసేందే కాంగ్రెస్ అని అన్నారు. అంజయ్యను, పివి నర్సింహ రావు లని అవమానిచింది కాంగ్రెస్.. దీన్ని తెలంగాణ ప్రజలు మరచి పోరని తెలిపారు. కాంగ్రెస్ కి ఓటు వేసిన, మజ్లీస్ కి ఓటు వేసిన అది బీఆర్ఎస్ కే పోతుందని అన్నారు. ఈ మూడు కుటుంబ పార్టీలు… ఎన్నికలకు ముందు వివిధ ఎజెండాలు, నినాదాలతో వస్తాయన్నారు. ఎన్నికలు అయిపోయాక కలిసి పోతాయన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి కాంగ్రెస్ 2 లక్షల కోట్లు ఇస్తే.. కేవలం తెలంగాణ కే రెండున్నర లక్షల కోట్లు కేంద్రం లోనున్న మోడీ సర్కార్ ఇచ్చిందన్నారు. వందకోట్లతో పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చామన్నారు. బీసీ నీ సీఎం చేస్తామని చెబుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు… వాళ్లు బీఆర్ఎస్ లో చేరారని అన్నారు. బీఆర్ఎస్ కి అవకాశం ఇస్తే అవినీతికి పాల్పడిందని అన్నారు. ఈ సారి బీజేపీకి అవకాశం ఇవ్వండని తెలిపారు.
Read also: Prabhas: తీరం తాకనున్న ‘సలార్’ తుఫాన్!
మత ఘర్షణల రికార్డ్ కాంగ్రెస్ ది… బీజేపీ ఎక్కడ అధికారం లో ఉన్న వీటిని అణచి వేస్తుందని అన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ తో సిద్ధాంత పరమైన, రాజకీయ పరమైన పొత్తులు ఎప్పుడు ఉండవన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరవాత అవినీతిపై విచారణ చేసి దోషులను జైల్ కి పంపిస్తామన్నారు. ఎంఐఎం పాలస్తీనా అంశం చెప్పకుండా ఇంకేమి చెప్పి ఓట్లు అడుగుతుందన్నారు. మాదిగ వర్గీకరణను స్పీడ్ అప్ చేసేందుకే కమిటీ అన్నారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామన్నారు. రోయింగ్యలపై ఎన్ఐఏ ఆక్షన్ తీసుకుంటుందని తెలిపారు. ఇక్కడ వాళ్లు కేసీఆర్ కి ఓటు బ్యాంక్… మా దృష్టిలో రోహింగ్యాలు దేశ ద్రోహులు అన్నారు. పీఎస్ యూ లను అమ్మాలని అనేది మా విధాన పరమైన నిర్ణయమన్నారు. తెలంగాణలో పబ్లిక్ సెక్టార్ యూనిట్ లను అమ్మమని, ఇక్కడ ఆ ప్రశ్న ఉత్పన్నం కాదని అన్నారు. ఎంఐఎం ఓటును ఈ సారి కాంగ్రెస్ తీసుకోబోతుంది.. అసద్ కి కాంగ్రెస్ భయం పట్టుకుందని తెలిపారు. రైతు బంధు నీ మేము ఆపమని షా అన్నారు.
Forex reserves: భారత విదేశీ మారక ద్రవ్య నిల్వల నివేదికను విడుదల చేసిన ఆర్‌బీఐ
