గణేష్ లడ్డూ అనగానే అందరికీ బాలాపూర్ గుర్తుకు వస్తుంది.. దానికి ఉన్న ప్రత్యేక అలాంటి మరి.. ఎందుకంటే.. అసలు లడ్డూ వేలం ప్రారంభించిందే అక్కడ కాబట్టి.. అంతేకాదు.. ప్రతీ ఏడాది తన రికార్డును తనే బ్రేక్ చేస్తూ.. కొత్త ధర పలుకుతూ పోతోంది బాలాపూర్ గణేష్ లడ్డూ.. బాలాపూర్‌లో లడ్డూ వేలం ప్రారంభమైన తర్వాత.. ఆ సెంటిమెంట్ రాష్ట్రవ్యాప్తంగా.. దేశవ్యాప్తంగా కూడా పాకింది.. అయితే, ఇప్పుడు బాలాపూర్ గణేష్ లడ్డూ రికార్డును బ్రేక్ చేసింది.. అల్వాల్‌లో ఏర్పాటు చేసిన గణపతి లడ్డూ.. ఈ ఏడాది.. బాలాపూర్ గణనాథుడి లడ్డూ.. వేలంలో రూ.24 లక్షల 60 వేల రూపాయలు పలికింది.. ఇక, అల్వాల్ పట్టణ కేంద్రంలోని డైరీ ఫార్మ్ రోడ్ కనజిగూడ మరకత శ్రీ లక్ష్మీ గణపతి లడ్డూ వేలంలో ఏకంగా రూ.46 లక్షలు పలికింది..
Read Also: Munugode Bypoll: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ప్రచార బాధ్యతలు-రేవంత్
మరకత శ్రీ లక్ష్మీ గణపతికి నవరాత్రులు అంగరంగ వైభవంగా భక్తులు పూజలు నిర్వహించారు.. ఆఖరి రోజు లడ్డూ వేలం పాట పాడారు.. వేలంలో ఏకంగా రూ.46 లక్షలు పలికింది ఆ లడ్డూ.. వేలం పాటలో లడ్డూను సొంతం చేసుకున్నారు.. గీత ప్రియ వెంకటరావు దంపతులు.. గత ఏడాది కూడా వారే ఈ లడ్డూను వేలంలో దక్కించుకోవడం మరో విశేషం.. ఆ దేవుని కటాక్షంతో ఉన్నత స్థాయిలో ఉన్నాం.. అందేకు మరోసారి లడ్డూ కోసం వేలం పాటలో పాల్గొన్నట్టు తెలిపారు. అయితే, ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ధర పలికిన లడ్డూ మాత్రం మరకత శ్రీ లక్ష్మీ గణపతి లడ్డూయే. కాగా, గతంలోనూ కొన్ని సార్లు బాలాపూర్ గణేష్ లడ్డూ ధర కంటే.. కొన్ని చోట్ల అధిక ధర పలికిన సందర్భాలు లేకపోలేదు.. కానీ, బాలాపూర్ గణపతి లడ్డూ మాత్రం ప్రతీ ఏడాది పెరుగుతూ పోతూనే ఉంది.