Minister Indrakaran reddy: దక్షిణాది అయోధ్యగా పేరొందిన భద్రాచలం పుణ్యక్షేత్రంలో రాములోరి కళ్యాణ క్రతువులో ఆ మూడు రోజులే కీలక ఘట్టాలు. ఇలాంటి మధుర క్షణాలను జరుపుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 30న జరగనున్న రామయ్య కల్యాణానికి రంగం సిద్ధమవుతోంది. రాముడి కల్యాణాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్నారు. ఈనేపథ్యంలో.. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇవాల భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలో శ్రీసీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయం వద్ద మంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందించారు.
Read also: YS Viveka Murder Case: సుప్రీంలో వివేకా కేసు విచారణ.. 15లోగా దర్యాప్తు పూర్తి చేస్తామన్న సీబీఐ
ఆ తర్వాత భక్తులకు తాగునీటి కోసం ఏర్పాటు చేసిన జలప్రసాదాన్ని (ఆర్వో ప్లాంట్) మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. భద్రాచలంలో జరుగుతున్న శ్రీరామనవమి పుష్కర పట్టాభిషేకము ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్లుగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కిరణ్ రెడ్డి చెప్పారు. భద్రాచలంలో ఉత్సవాల నిర్వాణ కోసం కోటి రూపాయలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చారని చెప్పారు. భద్రాచలంలో గత పదేళ్ల నుంచి బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతుందని, ఇది నత్త నడక నడవడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని ఇంద్ర కిరణ్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ పట్ల తెలంగాణలో అభివృద్ధి పనుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తుందని ఇంద్ర కిరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kangana Ranaut: ప్రియాంకాను కరణ్ జోహర్ బ్యాన్ చేశాడు.. మరోసారి బాంబ్ పేల్చిన కంగనా