Site icon NTV Telugu

Extortion in the name of dengue: మళ్లీ డెంగీ కేసులు.. చికిత్స పేరిట లక్షల వసూళ్లు

Dengue

Dengue

తెలంగాణ రాష్ట్రంలో 2019 తర్వాత మళ్లీ డెంగీ కేసులు గణనీయంగా పెరుగుతుందని వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈనేపథ్యంలో.. ఇదే అదనుగా కొన్ని ప్రైవేటు​ ఆసుపత్రులు చికిత్స పేరిట రూ.లక్షలు వసూల్ చేస్తున్నాయని సమాచారం. అనవసరంగా.. ప్లేట్‌లెట్లు ఎక్కిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ తరహా ఫిర్యాదులుంటే 9154170960 నంబరుకు ఫిర్యాదు చేయాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు. ఇక రాష్ట్రంలో డెంగీ విజృంభిస్తోంది. ఇప్పటికే 1,300 డెంగీ కేసులు నమోదు కాగా, హైదరాబాద్‌లో అత్యధికంగా 600 దాటాయి. జూన్‌ నెలలోనే 565 కాగా.. జులై తొలి రెండు వారాల్లో 300కి పైగా కేసులు నమోదవ్వడం ప్రజలు భయాందోళనకు గురవతున్నారు.

అయితే ఇది అధికారిక లెక్కలు మాత్రమే కాగా, అనధికారికంగా వీటిసంఖ్య రెట్టింపు ఉంటుందని నిపుణుల అంచనా వేసారు. అయితే.. 2019 తర్వాత మళ్లీ డెంగీ కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈనేపథ్యంలో.. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు డెంగీ చికిత్స పేరిట ప్రజల నుంచి రూ.లక్షలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే.. ఈ తరహా ఫిర్యాదులుంటే ప్రైవేటు ఆసుపత్రులపై 9154170960 నంబరుకు కంప్లెంట్ చేయాలని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు ప్రకటించారు. దీంతో.. ఆరోగ్యశాఖకు ఫిర్యాదులొస్తున్నట్లు వైద్యవర్గాలు తెలపడం.. అధిక మొత్తంలో రుసుములు వసూలు చేసినట్లు రుజువైతే అలాంటి ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసారు.

read also: Work From Home: వర్క్ ఫ్రం హోమ్ ఇక చట్టబద్ధం.. ప్రపంచంలోనే తొలి దేశమిదే..

ఈనేపథ్యంలో.. వరంగల్‌ జిల్లా రంగశాయిపేటకు చెందిన రమణ అనే వ్యక్తకి రెండు వారాల క్రితం జ్వరంతో బాధపడుతుండటంతో.. అక్కడే వున్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయిస్తే డెంగీ అని తేలింది. దీందో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయాలని సూచించడంతో ఆసుపత్రిలో చేరాడు. రమణకు ప్లేట్‌లెట్లు లక్షకు తగ్గగానే, వాటిని ఎక్కించాలని చెప్పి హడావిడి చేసి, చివరకు వారం రోజులు ఆసుపత్రిలో ఉంచుకొని నయమైందని ఇంటికి పంపించారు. రమణ వద్ద నుంచి రూ.2.5 లక్షల బిల్లు చెల్లించాల్సి వచ్చిందని బాధితుడు వాపోయాడు. ఇలా ప్రైవేట్ ఆసుపత్రులు ఏదో రోగం అంటూ ప్రజల నుంచి దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసాడు.

రానున్న ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో మరింతగా వానలు కురిసే అవకాశాలుంటాయి. దీంతో.. అప్పుడు దోమలు వృద్ధి చెంది వైరస్‌ వ్యాప్తికీ అనుకూలిస్తుంది. కాగా.. దోమల ద్వారా వ్యాప్తి చెందే మలేరియా, డెంగీ, గున్యా, మెదడువాపు వంటి విషజ్వరాలే కాకుండా, కలుషిత నీటితో వాంతులు, విరేచనాలు, కామెర్లు, టైఫాయిడ్‌ తదితర వ్యాధులూ విజృంభించే అవకాశంమే కాకుండా.. సెప్టెంబరు నుంచి మార్చి వరకూ కబళించే స్వైన్‌ఫ్లూ పొంచి ఉంది. దీనికి తోడు కొవిడ్‌ ఉద్ధృతి మొదలైతే, ప్రజారోగ్యం అతలాకుతలమేననే ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రతి వ్యక్తికి సాధారణంగా రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య 1.50 లక్షల నుంచి 4 లక్షల వరకూ ఉంటుంది. అయితే.. డెంగీ రోగులకు ఎప్పుడైతే ప్లేట్‌లెట్ల సంఖ్య బాగా పడిపోతుందో, అప్పటినుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులను భయపెట్టే పర్వం ప్రారంభమవుతుంది. ఐసీయూ చికిత్స, గంటకోసారి పరీక్షలు, హడావిడిగా ప్లేట్‌లెట్లు ఎక్కించడంతో కనీసం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని బాధితులు వాపోతున్నారు.

Adipurush: ఎట్టకేలకు రిలీజ్ డేట్ ప్రకటించిన డైరెక్టర్.. కానీ!

Exit mobile version