Site icon NTV Telugu

MLA Jaggareddy: నేను ఏ పార్టీలో ఉంటే నీకేందుకు? వైఎస్ఆర్ కూతురైతే తిడితే ఊరుకుంటామా?

Jaggareddy, Sharmila

Jaggareddy, Sharmila

MLA Jaggareddy: నేను ఏ పార్టీలో ఉంటే నీకెందుకు షర్మిల అంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. నేతలను తిట్టడానికే షర్మిల పాదయాత్ర చేస్తుందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు అసలు రాజకీయాలపై అవగాహన లేదని విమర్శించిన ఆయన షర్మిలనే బాణాలు మార్చినపుడు మేం అనకూడదా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, షర్మిల.. వైఎస్ఆర్ కూతురైతే మాత్రం తిడితే ఊరుకుంటామా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వైఎస్ షర్మిల పార్టీ పెట్టుకొని తెలంగాణాలో పర్యటిస్తోందన్న ఆయన, పార్టీ పెట్టుకున్న లీడర్లు పబ్లిక్ ఇష్యూస్ పై పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. కానీ షర్మిల మాత్రం రాజకీయ విమర్శలకు ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపించారు.

అయితే.. వైఎస్ఆర్ తమ నాయకుడని, వైఎస్సార్ వున్నప్పుడు రాహుల్ ను ప్రధానిగా చూడాలని కోరుకున్నాడని ఈ సందర్భంగా జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. షర్మిల బీజేపీ, టీఆర్ఎస్ వదిలిన బాణం అని జగ్గారెడ్డి మాటలకు.. జగ్గారెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో అంటూ షర్మిల కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. నేను వైఎస్ వదిలిన బాణం అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు షర్మిళ. అయితే షర్మిళ కౌంటర్ కు నేడు జగ్గారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. షర్మిల జగన్ వదిలిన బాణం కాదు.. వదిలేసిన బాణం అని జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏపీలో సీఎం అయ్యే అవకాశం లేదు కాబట్టే తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టారని ఆరోపించారు.

Exit mobile version