Site icon NTV Telugu

నేడే ప్రగతిభవన్‌లో అఖిలపక్ష సమావేశం…

cm kcr

తెలంగాణ రాష్ట్రంలోని దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరచబోతున్న…‘‘ సిఎం దళిత్ ఎంపవర్ మెంట్ ’’ పథకానికి సంబంధించి విధి విధానాల రూపకల్పన కోసం చర్చించడానికి ఇవాళ ప్రగతి భవన్ లో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 11.30 గంటలకు ప్రగతి భవన్ లో ప్రారంభం కానున్న అఖిల పక్ష సమావేశం సుధీర్ఘంగా సాగనున్నది.

read also : మహిళలకు షాక్‌.. మరోసారి ఎగిసిపడ్డ పసిడి ధరలు

ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేశారు. లంచ్ అనంతరం సమావేశం రోజంతా కొనసాగనున్నది. దళిత ప్రజాప్రతినిధులతో కూడిన ఈ అఖిలపక్ష సమావేశంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన దళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. వారితో పాటు ప్రతిపక్ష ఎంఐఎం పార్టీకి చెందిన ఫ్లోర్ లీడర్లు కూడా పాల్గొంటారని సమాచారం. అయితే… ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరు కాబోమని తేల్చేశాయి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు.

Exit mobile version