NTV Telugu Site icon

TSLPRB: SI, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. పార్ట్‌-2 దరఖాస్తుల స్వీకరణ అప్పుడే..

Tslprb

Tslprb

TSLPRB: ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో పాసై, ఫిజికల్ టెస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులు పార్ట్-2 అప్లికేషన్లను అప్లోడ్ చేయాలని TSLPRB సూచించింది. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 10 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని తెలిపింది. ఫిజికల్ టెస్టులు ప్రతి ఒక్కరికి ఒక్కసారి మాత్రమే జరుగుతాయని, వాటి ఫలితాలనే అన్ని పోస్టులకు పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. అప్లై చేసుకోవాల్సిన సైట్: www.tslprb.in అని పేర్కొంది.

Read also: KA Paul: రెస్పెక్ట్ ఇవ్వండి.. నేను తెలంగాణకు కాబోయే సీఎంను..!

ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగార్థుల ప్రాథమిక రాత పరీక్ష (ప్రిలిమ్స్‌) ఫలితాలు నిన్న విడుదలైన విషయం తెలిసిందే.. ఉత్తీర్ణుల జాబితాను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియమాక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) విడుదల చేసింది. ఇక, తదుపరి దశలో ఫిజికల్‌ టెస్టులకు అర్హత సాధించినవారు, అనర్హుల వివరాలు నిన్న(శుక్రవారం) అర్ధరాత్రి నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని, లాగిన్‌ ఐడీ ద్వారా అభ్యర్థులు ఈ వివరాలను పొందవచ్చని టీఎస్‌ఎల్పీఆర్బీ చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు ప్రకటించిన విషయం తెలిసిందే..
Land Dispute: సంగారెడ్డిలో భూవివాదం.. కిరాయి గుండాలతో తండ్రి, కొడుకుపై దాడి