Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకార కార్యక్రమం రాజ్‌భవన్‌లో జరిగింది. ఈ మేరకు అక్బరుద్దీన్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు రాజ్ భవన్ కు చేరుకున్నారు. అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. అనంతరం అసెంబ్లీలో కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఇవాళ సాయంత్రం నోటిఫికేషన్ వెలువడనుంది. రేపు (ఆదివారం) స్పీకర్ ఎన్నిక జరగనుంది. వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్‌గా రేవంత్‌రెడ్డిని ప్రభుత్వం ఎంపిక చేసింది. దీంతో ఆయన ఎన్నికల లాంఛనం కానుంది.
Read also: America: చైనా కంపెనీల దిగుమతులపై అమెరికా నిషేధం..
తొలిరోజు ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం, రెండో రోజు స్పీకర్ ఎన్నిక జరగనుంది. మూడో రోజు గవర్నర్ ప్రసంగం జరగనుంది. నాలుగో తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. నాలుగు రోజుల పాటు జరిగే సమావేశాల కారణంగా శాసనసభ చుట్టూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం ఆరు గంటల నుంచి ఆంక్షలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు వచ్చే ఎమ్మెల్యేలు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జారీ చేసిన సర్టిఫికెట్ ఒరిజినల్, రెండు జిరాక్స్ కాపీలను తీసుకురావాలి. వాటిని శాసనసభ అధికారులకు అప్పగించాలి. అంతేకాకుండా తమ జీవిత భాగస్వామికి సంబంధించిన రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, నాలుగు ఫొటోలు తీసుకురావాలి. వారి బయోడేటా కూడా ఇవ్వాలి. వారికి ఎమ్మెల్యే విధివిధానాలను వివరిస్తూ కరదీపికను అందజేయనున్నారు.
బీజేపీ ఎమ్మెల్యే, కేసీఆర్ దూరం..
ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఎంపికపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రస్తుత ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. గతంలో కూడా రాజాసింగ్ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు. 2018లో అప్పటి సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ ప్రొటెం స్పీకర్‌గా నియమితులయ్యారు. దీంతో రాజా సింగ్ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ఆయనతోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ప్రమాణస్వీకార కార్యక్రమానికి దూరంగా ఉండే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. తుంటి ఎముకకు గాయమై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ సమావేశాలకు దూరంగా ఉండబోతున్నారు. నిన్న (శుక్రవారం) తన నివాసంలోని బాత్‌రూమ్‌లో జారిపడ్డాడు. దీంతో తుంటి ఎముక విరిగిపోయింది. నిన్న రాత్రి చికిత్స పొందారు. దీంతో ఆయన సమావేశానికి హాజరుకాలేకపోయారు.
Salaar: సరిగ్గా రెండు వారాల్లో బాక్సాఫీస్ పై దాడి చేయనున్న డైనోసర్…
