హైదరాబాద్ నగర వాసులకు మరో ఎక్స్ ప్రెస్ మెట్రో వేకు మార్గం సుగమం అయింది. హైదరాబాద్ నగర వాసులకు సేవలందిస్తున్న మెట్రో మరింతగా విస్తరించనుంది. డిసెంబర్ 9న సెకండ్ ఫేజ్ మెట్రోకి శంకుస్థాపన చేయనున్నారు సీఎం కేసీఆర్.. 31 కిలోమీటర్ల మెట్రో నిర్మాణానికి రూ 6250 కోట్ల ఖర్చు పెట్టనున్నారు. హైటెక్ సిటీ మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ వరకూ మెట్రో విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ప్రకటన పట్ల శంషాబాద్ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read ALso: Hyderabad TRS: ప్రగతి భవన్ లో సీఎం, తెలంగాణ భవన్ లో మంత్రులు, పార్టీ పటిష్టంపై చర్చ
హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతోంది… సీఎం కేసీఆర్ డిసెంబర్ 9వ తేదీన ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రోకు శంకుస్థాపన చేస్తారని ప్రకటించడం సంతోషంగా ఉంది…మైండ్‌స్పేస్ జంక్షన్ నుండి శంషాబాద్ విమానాశ్రయం వరకు ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్ట్ 31 కి.మీ పొడవు ఉంటుంది. సుమారు 6,250 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఈ మెట్రో వల్ల నగరం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి వెళ్లే వారికి మరింత సౌకర్యం కలగనుంది. మరోవైపు నగరంలో లకడీకాపూల్ నుంచి లింగంపల్లి వరకూ మెట్రో ప్రాజెక్టుకి ప్రభుత్వం సుముఖంగా వుంది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే నగరంలో ట్రాఫిక్ కష్టాలకు బ్రేక్ పడుతుందని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. నిజామాబాద్ నగరంలో మౌలిక వసతులను మరింతగా మెరుగుపరచడం, ప్రజలకు సౌకర్యవంతంగా అన్ని రంగాలను అభివృద్ధి పరిచి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం ..అనే అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సత్వరమే పనులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా సిఎం పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కెటిఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, వెంకటర్రామిరెడ్డి, కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేశ్ తో పాటు, జీవన్ రెడ్డి, రోహిత్ రెడ్డి, మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ , డైరక్టర్ సత్యనారాయణ, నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ చిత్ర తో పాటు నిజామాబాద్ జిల్లా పంచాయితీ రాజ్, రోడ్లు భవనాలు, ఇరిగేషన్, రెవిన్యూ, పబ్లిక్ హెల్త్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also: JP Nadda: ఆమ్ ఆద్మీ పార్టీ రేపిస్టును.. థెరపిస్టు చేసింది..