Site icon NTV Telugu

Agneepath Scheme: ఇన్ఫోసిస్‌ కో ఫౌండర్‌ నందన్‌ నిలేకని ఆసక్తికర వ్యాఖ్యలు

Nanadanj Nilekani

Nanadanj Nilekani

అగ్నిప‌థ్ స్కీమ్ దేశాన్నే కుదిపేస్తోంది. ఈ స్కీమ్ ను కొందరు స్వాగతిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్న విష‌యం తెలిసిందే. దీని వ్య‌తిరేక‌త‌కు నిద‌ర్శ‌నం సికింద్రాబాద్ లోని రైల్వే ఘ‌ట‌న అనే చెప్పొచ్చు. స్కీమ్ ను ర‌ద్దుచేయాల‌ని నిర‌స‌న‌లు భారీగా జ‌రిగాయి. అయితే దీనిపై ప‌లు కార్పొరేట్ దిగ్గ‌జాలు స్పందించి వ్యాక్య‌లు చేశారు. కొద్దిరోజుల క్రిత‌మే మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా ఛైర్మ‌న్ అగ్ని వీరుల భ‌విష్య‌త్ పై హామీ ఇచ్చిన విష‌యం తెలిసిందే.

అయితే తాజాగా ఇన్ఫోసిస్‌ కో ఫౌండర్‌ నందన్‌ నిలేకని అగ్నిపథ్‌ స్కీంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయ‌డం చ‌ర్చ‌కు దారి తీస్తోంది. కాగా.. ఇన్ఫోసిస్‌ 41వ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా.. అగ్నివీరులకు ఉద్యోగాలు కల్పించే అంశంపై ఇన్ఫోసిస్‌ పరిశీలిస్తుందా అని షేర్‌ హోల్డర్‌ అడిగిన ప్రశ్నకు నందన్‌ నిలేకని స్పందిస్తూ.. అవును మేము నమ్ముతున్నాము, అగ్నిపథ్‌ అనేది యువతకు గొప్ప అవకాశమని అన్నారు. అందులో చేరి జీవితాన్నిప్రారంభించడమే కాదు.. క్రమశిక్షణతో కూడిన వ్యవస్థను నిర్మించుకోవచ్చని తెలిపారు. దాంతో పాటు భవిష్యత్‌ కోసం కావాల్సిన నైపుణ్యాలని మెరుగుపరుచుకోవచ్చంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే.. ఇన్ఫోసిస్ యువతలో ఉన్న టాలెంట్‌ను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఈ సంస్థ నిర్దేశించిన సెలక్షన్‌ క్రైటీరియా మేరకు ఉద్యోగుల్ని నియమించుకుంటామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Sajid Mir: ముంబయి పేలుళ్ల సూత్రధారి సాజిద్ మీర్‌కు 15 ఏళ్లు జైలు శిక్ష

Exit mobile version