NTV Telugu Site icon

Advocate Incident: గన్ తో కాల్చుకుని.. అడ్వకేట్ బలవన్మరణం

Gun 1

Gun 1

హైదరాబాద్ చిక్కడపల్లి లో కాల్పులు కలకలం కలిగించాయి. కడపకు చెందిన న్యాయవాది శివారెడ్డి గన్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన దగ్గర వున్న లైసెన్సు రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు న్యాయవాది శివారెడ్డి. ఎయిర్ ఫోర్సులో కొన్నాళ్ల క్రితమే రిటైర్డ్ అయ్యారు శివారెడ్డి. రిటైర్డ్ అయిన తర్వాత న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు శివారెడ్డి. కొంతకాలం క్రితమే భార్యతో విడాకులు తీసుకున్నారు శివారెడ్డి. భార్యాభర్తల మధ్య వివాదాలే ఆత్మహత్మకు కారణం అయి వుంటాయని భావిస్తున్నారు.

ఇవాళ ఉదయమే కడప నుంచి హైదరాబాద్ చేరుకున్నారు శివారెడ్డి. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు శివారెడ్డి. సాయంత్రం వరకు శివారెడ్డి ఫోన్ లిఫ్ట్ చేయక పోవడంతో ఫ్రెండ్స్ కి సమాచారం ఇచ్చింది శివారెడ్డి సోదరి. ఇంటికి వచ్చి ఫ్లాటు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళిన ఫ్రెండ్స్ అక్కడి దృశ్యం చూసి షాకయ్యారు. లైసెన్సుడు రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు శివారెడ్డి. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. శివారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. అడ్వకేట్ బలవన్మరణం సంచలనం కలిగించింది.

Govt Jobs: శుభవార్త.. మరో 2,440 ఉద్యోగాల భర్తీకి సర్కారు అనుమతి

గోదాములో దోచుకుని… అరటితోటలో దాచారు

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో చోరీ జరిగింది. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామంలో ఎలాస్టిక్‌ రన్ గోదాములో ఆరు లక్షల నగదు చోరీకి గురైనట్లు సూపర్‌ వైజర్ దుగ్గిరాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు కాలి అడుగు ముద్రలను గమనించారు. అరటి తోటలో చోరీకి గురైన నగదు పెట్టెను తోటలో దాచినట్లు గుర్తించారు, అనంతరం క్లూస్ టీమ్స్ వివరాలు సేకరించారు. ఈ దొంగతనానికి ఎవరు పాల్పడ్డారు అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు. సినిమా ఫక్కీలో చోరీ సొత్తును కనిపెట్టారు పోలీసులు.

Show comments