MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్ కింద అడ్వైజరీ బోర్డు విచారణ జరపనుంది. ఇవాళ అడ్వైజరీ బోర్డు ముందు ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరుకానున్నారు. జైలు నుంచే వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా విచారించనుంది అడ్వైజరీ బోర్డు. ముగ్గురు విశ్రాంత న్యాయమూర్తులతో పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు కమిటీ విచారించనుంది. రాజా సింగ్ బైల్ లో అడ్వైజరీ బోర్డు విచారణ కీలకంగా మారనుంది. పీడీ యాక్ట్ కింద మూడ నెలల నుంచి ఏడాది వరకు జైల్లో వుండే అవకాశం వుంది. పీడీ యాక్ట్ ప్రొసీజర్ ను పరిశీలించనుంది అడ్వైజరీ బోర్డు. ఇప్పటికే పలు సాక్ష్యాలను సమర్పించారు పోలీసులు. అడ్వైజరీ బోర్డు విచారణ తరువాత బోర్డు నిర్ణయాన్ని బట్టి రాజాసింగ్ కోర్టుకు వెళ్లే అవకాశం వుంటుంది. గత ఏడాది కాలంలో 664 మందిపై పీడీ యాక్ట్ లు నమోదయ్యాయి.
ఓ మతాన్ని కించపరుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజసింగ్ చర్లపల్లి జైలులో ఉన్నారు. దీంతో ఆగస్ట్ 25న పీడీ యాక్ట్ కింద పోలీసులు అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే.. 2022 ఏప్రిల్ 12న శ్రీరామనవని పురస్కరించుకొని నిర్వహించిన శోభాయాత్ర సందర్భంగా రాజా సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని షాహినాత్ గంజ్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ఈ ఏడాది ఫిబ్రవరి 20న పోలీసులు యూపీ ఎన్నికల విషయమై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఈనేపథ్యంలో.. ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి ఓటేయకపోతే బుల్‌డోజర్లు వస్తాయంటూ.. యోగి ఆదిత్యనాథ్ కు ఓటేయకపోతే యూపీని వదిలి వెళ్లాల్సి వస్తోందని కూడా వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఈసీ.. రాజాసింగ్ ను వివరణ కోరింది. రాజాసింగ్ వ్యాఖ్యల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రాజాసింగ్ పై కేసు నమోదు చేయాలని కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాల మేరకు మంగళ్ హాట్ పోలీసులు రాజాసింగ్ పై కేసు నమోదు చేయడమేకాకుండా.. రాజాసింగ్‌పై బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఈసీ. ఈనేపథ్యంలో.. రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పై తెలంగాణ పోలీసులు కుట్ర పనుతున్నారు అంటూ ఆరోపించారు. ఫిబ్రవరి, ఏప్రిల్ లో నమోదైన కేసులపై ఇప్పుడు ఎందుకు నోటీసులు ఇస్తున్నారు అంటూ రాజా సింగ్ ప్రశ్నించారు. తనను అరెస్ట్ చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్నారని పోలీసులపై నిప్పులు చెరిగారు. ఇన్ని రోజులు తెలంగాణ పోలీసులు నిద్ర పోతున్నారా? అంటూ ప్రశ్నించారు.
Andhra Pradesh: గంజాయి సరఫరాలో నంబర్ వన్
