Milk Gang Arrest: పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది. కానీ, మనం తాగే పాలు నాణ్యత ముఖ్యం. కల్తీ పాలు మూత్రపిండాల సమస్యలు, జీర్ణ సమస్యలు, విరేచనాలకు దారితీస్తాయి. దీంతో అనారోగ్య సమస్యలకు గురువుతుంటారు. అయితే హైదరాబాద్ నగరంలో కేటుగాళ్లు ఈజీగా మనీ కోసం పాలను కల్తీ చేస్తున్నారు. తమ స్వలాభం కోసం ఓ ముఠా కల్తీ పాల రాకెట్‌ను ప్రారంభించింది. సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు వెంటనే గ్రామంలో దాడులు నిర్వహించి నేరం సాగిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. సూత్రధారి పరారీలో ఉండగా, ముఠాలోని నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి మూడు వేల లీటర్ల పాలతో పాటు టిన్నులు, పాల ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Read also: Tandur Kandi Pappu: రైతుల పంట పండింది.. కందులకు రికార్డు ధర..!
మేడ్చల్‌కు చెందిన శేఖర్ అనే వ్యక్తి మేడ్చల్‌లో స్వీట్ షాప్ వ్యాపారం చేస్తున్నాడు. సులువుగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్న శేఖర్ ముగ్గురు ఆటో డ్రైవర్లు, మిల్క్ ట్యాంకర్ డ్రైవర్‌తో కలిసి నకిలీ పాల రాకెట్‌ను ప్రారంభించాడు. ఈ క్రమంలో కర్నూలు నుంచి శంషాబాద్ మీదుగా నాగ్ పూర్ వెళ్లే పాల ట్యాంకర్ నుంచి పాలను తీసుకెళ్లి అందులో నీళ్లు పోస్తున్నారు. తొమ్మిది వేల లీటర్ల పాలను తీసుకెళ్తున్న మిల్క్ ట్యాంకర్ నుంచి నలుగురు నిందితులు 3000 లీటర్ల పాలను తీసి, పాల ట్యాంకర్‌లోని పాలను నీటిలో కల్తీ చేశారు. ఈ ముఠా 40 లీటర్ల 83 పాల టిన్నులను తీసుకొచ్చి పాలను దొంగిలిస్తుంది. విశ్వసనీయ సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు ముఠాపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో శేఖర్ నియమించిన ముగ్గురు ఆటో డ్రైవర్లు చాందిలాల్, చేతన్, సచిన్‌తో పాటు వారికి సహకరించిన పాల ట్యాంకర్ డ్రైవర్ వెంకన్నను శంషాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి శేఖర్ పరారీలో ఉన్నాడు. అరెస్టు చేసిన వారి నుంచి 3000 లీటర్ల పాలతో పాటు డబ్బాలు, పాల ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
CM YS Jagan: చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయే రోజు ఇది.. ఇక నుంచి సామాజిక అమరావతి