BRAOU : డిగ్రీ , పీ.జీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దూరవిద్య ద్వారా చదువుకోవాలనుకునే వారికి డా.బీ.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బీఆర్ఏఓయూ) శుభవార్త చెప్పింది. 2022-2023 సంవత్సరానికి డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా మరియు సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లకు బీఆర్ఏఓయూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అండర్ గ్రాడ్యుయేట్, పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు కావాల్సిన అర్హతలు, దరఖాస్తు వివరాలు, ముఖ్యమైన తేదీలను వెల్లడించింది. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు.. పీజీలో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్ఐఎస్సీ (BLISc), ఎంఎల్ఐఎస్సీ (MLISc) సహా పలు సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది బీఆర్ఏఓయూ. దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో జూన్ 30 నుంచి ప్రారంభం అవ్వగా.. జులై 31వ తేదీతో ముగియనుంది. మరిన్ని వివరాలను https://www.braouonline.in/వెబ్సైట్లో పొందవచ్చు.
Also Read
- Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి 'చేప ప్రసాదం' పంపిణీ..
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
వీటితోపాటుగా అంతకు ముందు విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు పొందిన వారు.. సెకండియర్ ట్యూషన్ ఫీజును, అంతకుముందు చేరిన విద్యార్థుల్లో సకాలంలో చెల్లించలేకపోయిన వారు కూడా జూలై 31వ తేదీ లోగా ట్యూషన్ ఫీజును ఆన్లైన్ విధానంలో చెల్లించాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ (డిగ్రీ) కు 10+2 / ఇంటర్మీడియట్ / ఐటీఐలో ఉత్తీర్ణత సాధించాలి. బీఏ, బీకాం, బీఎస్సీ – తెలుగు / ఇంగ్లిష్ మీడియం, బీఏ, బీఎస్సీ – ఉర్దూ మీడియంలలో ఉన్నాయి. ఇక పీజీ కోర్సులైన ఎంఏ / ఎంఎస్సీ / ఎంకాంలకు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతను అర్హతగా పేర్కొంది. ఇవి కూడా తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో ఉన్నాయి. మరిన్ని వివరాలకు వర్సిటీ హెల్ప్‌లైన్ నెంబర్లు 7382929570, 7382929580, 7382929590 & 7382929600లకు కాల్ చేయాలని సూచించారు.
తాజావార్తలు
-
Car Accident: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
-
KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
-
Fake Job Offers: ఫేక్ జాబ్ ఆఫర్స్ గుర్తించడం ఎలా? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.!
-
Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
-
Shocking: బెడ్‌షీట్‌పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!