NTV Telugu Site icon

BRAOU : డిగ్రీ , పీ.జీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

Braou

Braou

దూరవిద్య ద్వారా చదువుకోవాలనుకునే వారికి డా.బీ.ఆర్‌. అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బీఆర్‌ఏఓయూ) శుభవార్త చెప్పింది. 2022-2023 సంవత్సరానికి డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా మరియు సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లకు బీఆర్‌ఏఓయూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అండర్ గ్రాడ్యుయేట్, పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు కావాల్సిన అర్హతలు, దరఖాస్తు వివరాలు, ముఖ్యమైన తేదీలను వెల్లడించింది. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు.. పీజీలో ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ (BLISc), ఎంఎల్‌ఐఎస్సీ (MLISc) సహా పలు సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది బీఆర్‌ఏఓయూ. దరఖాస్తులను ఆన్‌లైన్‌ విధానంలో జూన్ 30 నుంచి ప్రారంభం అవ్వగా.. జులై 31వ తేదీతో ముగియనుంది. మరిన్ని వివరాలను https://www.braouonline.in/వెబ్‌సైట్‌లో పొందవచ్చు.

 

వీటితోపాటుగా అంతకు ముందు విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు పొందిన వారు.. సెకండియర్‌ ట్యూషన్‌ ఫీజును, అంతకుముందు చేరిన విద్యార్థుల్లో సకాలంలో చెల్లించలేకపోయిన వారు కూడా జూలై 31వ తేదీ లోగా ట్యూషన్‌ ఫీజును ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ (డిగ్రీ) కు 10+2 / ఇంటర్మీడియట్ / ఐటీఐలో ఉత్తీర్ణత సాధించాలి. బీఏ, బీకాం, బీఎస్సీ – తెలుగు / ఇంగ్లిష్ మీడియం, బీఏ, బీఎస్సీ – ఉర్దూ మీడియంలలో ఉన్నాయి. ఇక పీజీ కోర్సులైన ఎంఏ / ఎంఎస్సీ / ఎంకాంలకు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతను అర్హతగా పేర్కొంది. ఇవి కూడా తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో ఉన్నాయి. మరిన్ని వివరాలకు వర్సిటీ హెల్ప్​లైన్ నెంబర్లు 7382929570, 7382929580, 7382929590 & 7382929600లకు కాల్​ చేయాలని సూచించారు.