తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అభివృద్ధిలో దూసుకుపోతోంది. అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి.. ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకుంది తెలంగాణ సర్కార్. అందులో భాగంగానే ప్రకృతిని కాపాడేందుకు… ముఖ్యమంత్రి కేసీఆర్ ”హరితహారం” అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. ప్రతి యేటా… వర్షాకాలం ఆరంభ సమయంలో ”హరితహారం” కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళుతోంది కేసీఆర్ సర్కార్.
read also : తెలంగాణ కోవిడ్ అప్‌డేట్.. ఈరోజు ఎన్ని కేసులంటే..?
ఇది ఇలా ఉండగా.. తాజాగా తెలంగాణకు చెందిన ఇద్దరు పిల్లలు (11 & 7 సంవత్సరాల వయస్సు )తమ వంతుగా పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నాలు చేశారు. పర్యావరణాన్ని కాపాడటానికి వారి సొంతింట్లోనే… మామిడి మొక్కలను పెంచారు ఆ పిల్లలు. ఈ మొక్కలు సంబంధించిన ఫోటోలు కాస్త… కేటీఆర్ దాకా చేరాయి. ఎప్పుడు ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్.. ఆ చిన్నారులను మెచ్చుకున్నారు. మీరు చాలా మంచి చేశారు… చాలా అద్భుతం అంటూ చప్పట్లతో ఆ పిల్లలపై పొగడ్తల వర్షం కురిపించారు మంత్రి కేటీఆర్.
