Weather Today: అల్పపీడన ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో ఉదయం 9 గంటలైనా ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో అటవీ ప్రాంతాలున్న జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. దీంతో గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలు నీడన తిరుగుతున్నారు. వాతావరణ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Read also: Burra Venkatesham: గ్రూప్-2 అభ్యర్థులు ఎలాంటి ఆందోళన వద్దు..
ఆదిలాబాద్‌లో 6.2, నిర్మల్‌లో 8.5, మెదక్‌లో 10.8, నిజామాబాద్‌లో 13.8, హైదరాబాద్‌లో 17.3, భద్రాచలంలో 18.5, ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్‌లో 6.7, నిర్మల్ జిల్లా పెంబిలో 9.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత మహబూబ్‌నగర్ జిల్లాల్లో 18.9 డిగ్రీలుగా నమోదైంది. కాగా, రాష్ట్రంలో రోజురోజుకు తగ్గుతున్న ఉష్ణోగ్రతల కారణంగా చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. దీంతో ఉదయం లేవాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే చలి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఆస్తమా, ఊపిరితిత్తులు, గుండె సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
Cabinet Expansion: నేడు మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ.. వీరికే మంత్రి పదవులు..!